'తని వరువన్'లో ఆ యువ ఐపీఎస్ ఆఫీసర్, ఓ బడా పారిశ్రామిక వేత్తల ఎత్తులు, పై ఎత్తులతో సాగిన కథ, కథనం మన వారిని బాగా ఆకట్టుకోవడంతో ఈ చిత్రాన్ని ఏకంగా రామ్ చరణ్-అల్లు అరవింద్-సురేందర్‌రెడ్డిలు 'ధృవ'గా చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే విధంగా ఇంటెలిజెంట్ కథ,కథనాలతో రూపొందిన తమిళ చిత్రం 'విక్రమ్ వేద' తమిళ నాట సంచలనంగా మారింది. నటనతో తమకు తామే సాటిగా నిరూపించుకున్న చాక్లెట్‌బోయ్ నుంచి ఏ తరహా పాత్రలనైనా చేసే మాధవన్, ఇప్పుడు కొద్దికాలంలోనే తన నటనతో, టాలెంట్‌తో ఆకట్టుకుంటున్న విజయ్‌సేతుపతిల కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందింది.
ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం జీఎస్టీ రేట్లను, సినిమారంగంలోని పలు రంగాలు చేస్తున్న ఆందోళనలు, భారీగా పెరిగిన టిక్కెట్ల రేట్లు, మల్టీప్లెక్స్‌లలో పెరిగిన టిక్కెట్ల పెరుగుదల వంటి అవరోధాలను కూడా అతిక్రమించి, ప్రేక్షకుల ఆదరణ, విమర్శకుల ప్రశంసలు, అద్భుతమైన రివ్యూలు, రేటింగ్‌లతో సంచలనం సృష్టిస్తోంది. ఇటు తెలుగు 'ఫిదా' హవా సాగుతుండగా, తమిళంలో 'విక్రమ్ వేద' వార్తల్లో నిలుస్తోంది. ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి క్రిమినల్‌గా నటించగా, మాధవన్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటించాడు. భార్యా భర్తలైన గాయత్రి-పుష్కర్ ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం టాలీవుడ్ నుంచి మాంచి గిరాకీ ఏర్పడిందట. చిత్రం చూసిన వారు మాత్రం రీమేక్ కంటే డబ్బింగ్ చేస్తేనే బాగుంటుందని, మరోసారి అదే ఫీల్‌ని ఎవరు చేసినా రాబట్టడం కష్టమంటున్నారు. మరి మాధవన్‌కి తెలుగులో గుర్తింపు ఉన్నా కూడా విజయ్ సేతుపతికి ఇక్కడ ఎలాంటి గుర్తింపు లేకపోవడం సినిమాకు మైనస్ అవుతుందని, కాబట్టే రీమేక్ చేయాలని మన మేకర్స్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.