Advertisementt

నయనతార సమాధానం వింటే షాకావాల్సిందే!

Thu 27th Jul 2017 05:38 PM
nayanthara,rajinikanth,nayanthara shocking answer,young heroes  నయనతార సమాధానం వింటే షాకావాల్సిందే!
Nayanthara Shocking Answer On Young Heroes నయనతార సమాధానం వింటే షాకావాల్సిందే!
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో నయనతార కి ఇప్పుడు ఎదురు లేదు. టాప్ హీరోయిన్ గా టాప్ పొజిషన్లో కొనసాగుతున్న నయనతార అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా సై అంటున్నారు. కోలీవుడ్ లో ఒక సినిమాకి మూడు కోట్లదాకా రెమ్యునరేషన్ తీసుకుంటూ మిగతా హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. స్టార్ హీరోల  పక్కన జోడి కడుతూనే హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ లోను దూసుకుపోతుంది. అలాగే ఇప్పటి వరకు ఎక్కువగా స్టార్ హీరోలతో జతకట్టిన నయనతార ఇప్పుడు తనకంటే చిన్నవాళ్ళు, కొత్త వాళ్ళు అయిన యంగ్ హీరోలతో సైతం నటించడానికి రెడీ అవుతుంది.

మరి కోలీవుడ్ లో స్టార్ రేంజ్ పొజిషన్ లో వెలుగొందుతున్న నయనతార ఇలా చిన్న చితక హీరోలతో జోడి ఎందుకు కట్టడం.... మీ ఇమేజ్ కి ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అన్న ప్రశ్నకి నయనతార దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. అలా కుర్ర హీరోలు, కొత్త హీరోలతో జోడి కడితే తప్పేముంది. నేను హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కొత్త అమ్మాయినే కదా..! ఆ టైం లోనే నేను స్టార్ హీరోల పక్కన నటించాను. అప్పుడు వారు ఒక కొత్తమ్మాయి పక్కన నటించడం ఏమిటని అనుకుంటే నేను ఇప్పుడు ఎక్కడ ఉండేదాన్ని అంటుంది.

అందుకు ఉదాహరణగా సూపర్ స్టార్ రజినీకాంత్ నే చూపిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో 'చంద్రముఖి' లో నేను హీరోయిన్ గా చేయలేదా..... అప్పుడు నాలాంటి చిన్న హీరోయిన్ తో కలిసి నటించడం ఎందుకు అని రజనీకాంత్ గారు అనుకుంటే నేను ఇప్పుడు కోలీవుడ్ లో ఈ  రేంజ్ కి రాగలిగేదానినా అంటూ భలేగా తెలివైన సమాధానం ఇస్తుంది. అలాగే రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ కే కొత్త వాళ్ళతో చేయడానికి అభ్యంతరం లేనపుడు నాకెందుకు వుండాలి అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది.

Nayanthara Shocking Answer On Young Heroes:

Heroine Nayanthara About Her Acting with Young Heroes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ