తెలుగులో ఇప్పటి వరకు సినీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసురాళ్లు పెద్దగా ఆకర్షించలేకపోయారు. మన హీరోల అభిమానుల ప్రవర్తన కూడా అందుకు ఒక కారణం, కృష్ణ కూతురు మంజుల, అక్కినేని ఫ్యామిలీ హీరోయిన్ సుప్రియ, మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారికలకు ఇదే పరిస్థితి ఎదురైంది. అయినా ఎప్పుడు వార్తల్లో ఉంటే సినీ జంట రాజశేఖర్-జీవితలు ప్రస్తుతం తమ పెద్దమ్మాయి శివానీని హీరోయిన్‌గా పరిచయం చేసే పనిలో ఉన్నారు.
ఆ విషయాన్ని వారు ఓపెన్‌గా కూడా చెప్పేశారు. ఇక తెలుగులో సరికాదని కోలీవుడ్ ద్వారా పరిచయం చేయాలనే ఆలోచనాలో ఉన్నామని తెలిపారు. కానీ తమ అమ్మాయిని ముందు మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత సినిమాలలో నటించమని చెప్పామని,సినిమాను పూర్తి వృత్తిగా భావించకుండా కేవలం సైడ్ వ్యవహారంగా చూడమని చెప్పామని, రెండో అమ్మాయికి కూడా నటనంటే ఆసక్తి అని, తాము ఆమె కూడా నటిగా అవుతామంటే కాదనమని చెప్పారు.
ఇక వారి పెద్దమ్మాయి తన తల్లి జీవితలాగా అటు నటనలో, ఇటు గ్లామర్‌లో కూడా రాణించాలని ఉన్నట్లు చెప్పింది. ఇక ఆమె ఇండియాలోని ప్రముఖ ఏజెన్సీ సంస్థ క్వాన్‌తో ఆమె అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇక తన ఫొటో షూట్లతో పలువురి చూపులను ఆకర్షిస్తోంది. కాగా ఆమె ప్రముణ నిర్మాత, 'పెళ్ళి చూపులు' ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి తెరంగేట్రం చేయనున్న చిత్రం ద్వారానే శివానీ తెలుగు సినీ ఎంట్రీ కూడా ఇవ్వనుందని సమాచారం.
ప్రస్తుతం శివాని మెడిసిన్ చేస్తుండగా, శివ కందుకూరి యూఎస్‌లో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇద్దరి చదువులు త్వరలోనే పూర్తవ్వనుండటంతో శివ, శివానీల కాంబినేషన్‌లో చిత్రం రూపోందనుందని సమాచారం. మరి అప్పటిదాకా శివానీ వెయిట్ చేస్తుందా? లేక అంతలో కోలీవుడ్‌లో ఓ రౌండ్‌వేసి వస్తుందా? అనేది వేచిచూడాల్సివుంది..!