ప్రస్తుతం బాలకృష్ణ తన 101 వ చిత్రంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'పైసా వసూల్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్టంపర్ రేపు విడుదలకానుంది. కాగా ఇందులో అందాల తారలు శ్రియాశరన్, కైరాదత్‌లతో పాటు ముస్కిన్ సేధి కూడా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో కైరాదత్ ఓ ఐటం సాంగ్‌తో పాటు కొన్ని సన్నివేశాలలో కూడా నటించనుంది. ఈ బెంగాళీ భామ మోడలింగ్‌లో, పలు యాడ్స్‌లో సెక్సీగా నటించిన సెక్సీ సుందరిగా పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత ఈమెకు కోలీవుడ్‌లో ఐటం సాంగ్స్‌లో చాన్స్‌లు వచ్చాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ -సురేందర్‌రెడ్డిల కాంబినేషన్‌లో వచ్చిన 'రేసుగుర్రం'లో 'బూచాడే.. బూచాడే..' పాటలో బన్నీకి దీటుగా స్టెప్స్ వేసింది. బన్నీ మంచి డ్యాన్సర్, ఆయన పక్కన డ్యాన్స్‌లలో ఓకే అనిపించడంతో 'పైసా వసూల్'లో బాలయ్య సరసన చిందేసే చాన్స్ దక్కింది. తాజాగా ఈ అమ్మడు బాలయ్య గురించి చెబుతూ, 'ఆయన చాలా గ్రేట్. ఆయన వంటి వారిని బాలీవుడ్‌లో కూడా చూడలేదు. ఆయన చాలా ప్రొఫెషనల్. ఎంతో గౌరవం ఇస్తారు. అంతేకాదు.. నాతో తెలుగు బాగా మాట్లాడించింది కూడా ఆయనే. డైలాగులలో ఎక్కడ ఆపాలి...ఎక్కడ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి అనేవి ఆయనే స్వయంగా చేసి చూపించేవారు.
ఆయన వల్లనే డైలాగ్స్ బాగా చెప్పాను.. అంటూ బాలయ్యను తెగపొగిడేస్తోంది. కాగా ఈ చిత్రం షూటింగ్‌లో ఇప్పటికే శ్రియా శరన్, కైరాదత్‌ల చిత్రీకరణ పూర్తయింది. మరి ముస్కిన్ సేథ్ గురించి మాత్రం ఇప్పటి వరకు వివరాలు బయటకు రాలేదు. మొత్తానికి రేపు ఉదయం విడుదలయ్యే ఈ చిత్రం స్టంపర్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.