Advertisementt

నాగ చైతన్యకి ఇదైనా కలిసొచ్చేనా..?

Fri 28th Jul 2017 06:05 PM
naga chaitanya,yuddham sranam movie,teaser release on 31st july,director krishna rv marimuthu  నాగ చైతన్యకి ఇదైనా కలిసొచ్చేనా..?
Naga Chaitanya Film 'Yuddham Saranam' నాగ చైతన్యకి ఇదైనా కలిసొచ్చేనా..?
Advertisement
Ads by CJ

మిల్కీబోయ్‌ ఇమేజ్‌తో నాడు ఏమో గానీ నేడు ఏళ్లకు ఏళ్లు నెట్టుకురావడం కష్టమని నేటితరం హీరోలు భావిస్తారు. నాడు హరనాథ్‌, ఏయన్నార్‌, శోభన్‌బాబులు అలా చాలా ఏళ్లు క్లాస్‌ హీరోలుగా, ఫ్యామిలీ హీరోలుగా మెప్పించారు. ఇక జగపతిబాబు, శ్రీకాంత్‌లకి ఆ కాల పరిధి కాస్త తగ్గింది. ఇక నాగార్జున విషయానికి వస్తే 'శివ' ఆ తర్వాత మరికొన్ని చిత్రాలతో ఆయనకు క్లాస్‌ ఇమేజ్‌తో పాటు మాస్‌ ఇమేజ్‌ కూడా వచ్చింది. 

'శివ, మాస్‌' ఎలాగో, 'గీతాంజలి, మన్మథుడు, నిన్నేపెళ్లాడతా'లా రెండింటిలో ఆయన బాగానే రాణించాడు. రాణిస్తున్నాడు. దాంతోనే ఆయనకు హీరో కెరీర్‌ కూడా చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. అక్కినేని ఫ్యామిలీ అంటే క్లాస్‌ అనే ఇమేజ్‌ను తన మొదటి చిత్రంతోనే తరమివేయాలని అక్కినేని చిన్నోడు అఖిల్‌ తన 'అఖిల్‌'తో లోకరక్షకుడి పాత్రను భుజాన మోసి దెబ్బతిన్నాడు. 

ఇక నాగ చైతన్య కూడా పలు చిత్రాలలో ఆ పని చేసినా ఏదో సునీల్‌తో చేసిన రీమేక్‌ 'తడాఖా' తప్పించి మరే యాక్షన్‌ చిత్రం ఆయనకు విజయాన్ని అందించలేదు. ఇక 'రారండోయ్‌ వేడుక చూద్దాం'తో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం కృష్ణ RV మరిముత్తు అనే కొత్త దర్శకునితో 'యుద్దం శరణం' చేస్తున్నాడు. ఇందులో ఆయన పాత్ర మాస్‌ అండ్‌ యాక్షన్‌గా సాగుతుందట.ఇటీవల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే ఈ విషయంలో కాస్త క్లారిటీ వచ్చింది. కాగా ఈ చిత్రం టీజర్‌ని ఈనెల 31నే విడుదల చేయాలని భావించారు. 

పూర్తి స్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందని చిత్రానికి ఇదేసరైన టైటిల్‌ అని చిత్ర సమర్పకుడు, అభిరుచి ఉన్ననిర్మాత సాయికొర్రపాటి అంటున్నాడు. నాగ చైతన్య లుక్‌, ఆయన పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటాయి. ఇది ఆయన కెరీర్‌లోనే బెస్ట్‌ ఫిల్మ్‌ అవుతుంది. శ్రీకాంత్‌ ఇందులో తొలిసారి విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఇక రావురమేష్‌, రేవతి, మురళీశర్మల పాత్రలు కూడా ఎంతో కీలకం అంటున్నారు. 

చిత్రీకరణ చివరి దశలో ఉంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా వేగం జరుగుతున్నాయి. ఇక ఈ టీజర్‌ మిగిలిన టీజర్ల లాగా రొటీన్‌గా ఉంకుండా వైవిధ్యంగా ఉంటుందని నాగ చైతన్య ట్వీట్‌ చేశాడు. మీకు టీజర్‌ చూపించడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్‌ చేశాడు. 

Naga Chaitanya Film 'Yuddham Saranam':

Naga Chaitanya starring movie 'Yuddham Saranam' Director by Krishna RV marimuthu this movie Teaser release on 31st July 2017.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ