తెలుగులో 'నేనే రాజు నేనే మంత్రి'గా రానున్న రానా-తేజలు తమిళంలో కూడా రానాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ 'నాన్ ఆనై విట్టాల్'పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో పక్కా తమిళియన్ అవతారంలో పంచెకట్టు కట్టి వచ్చిన రానా తన మాటల చాతుర్యంతో తమిళ ప్రేక్షకులను ఫిదా చేసే ప్రయత్నం చేశాడు.
నాకు ప్రయోగాత్మక చిత్రాలే బలం, తెలుగులో ఉన్నా లేకున్నా కోలీవుడ్‌లో మాత్రం వైవిధ్యభరితమైన చిత్రాలకు, ప్రయోగాత్మక చిత్రాలకు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కాబట్టి కోలీవుడ్‌తోపాటు తమిళ ప్రేక్షకులే నా బలం, ఇక 'బాహుబలి, ఘాజీ'లగానే ఈ చిత్రం కూడా ఎంతో డిఫరెంట్‌గా ఉంటుందని హామీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రంలోని 'ఓ వందమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి రిసార్ట్స్‌లో పెడితే నేను కూడా సీఎంనే' అనే డైలాగ్ తమిళంలో చర్చనీయాంశంగా, హాట్‌టాపిక్‌గా మారింది.
దాని గురించి తేజ మాట్లాడుతూ, దానిని కావాలని పెట్టలేదు. సీన్‌కి తగ్గట్లుగానే రాసుకున్నాం. కాకపోతే రిసార్ట్స్ అనే స్థానంలో హోటల్ అని రాశాం. తర్వాత పరిస్థితులకు తగ్గట్లుగా 'హోటల్' స్థానంలో రిసార్ట్స్ అనే పదాన్ని మార్చాం అని చెప్పాడు. అంటే నాడు చంద్రబాబు తన టిడిపి ఎమ్మెల్యేలను తీసుకునిహైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్‌లో ఉంచి ఎన్టీఆర్‌పై చెప్పులు వేసిన ఘటనకు సింబాలిక్‌గా ఈ డైలాగ్‌ని రాసి, తర్వాత తమిళనాడు రాజకీయ పరిణామాలు, చిన్నమ్మ శశికళ వర్గం ఎమ్మెల్యేలను రిసార్ట్స్‌లో ఉంచిన సంఘటనకు స్ఫూర్తిగా ఈ డైలాగ్‌ని రాశారని అనిపిస్తోందని చెప్పడం నిజమే..!