పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడోసారి తెరకెక్కుతున్న చిత్రానికి రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికే 100 కోట్ల పైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని చెబుతున్న ఈ చిత్రం ఇప్పుడు మరో రికార్డు సృష్టించిందనే న్యూస్ ఇప్పుడు తెగ సర్క్యులేట్ అవుతుంది. పవన్ కొత్త చిత్రం శాటిలైట్ హక్కులు ఏ ఇతర తెలుగు సినిమా అమ్ముడుపోనంత భారీ రేటుకు అమ్ముడు పోయిందంటున్నారు. హిందీ వెర్షన్ డబ్బింగ్ హక్కులని 11 కోట్ల కి అమ్ముడై రికార్డు సృష్టించిన ఈ చిత్ర తెలుగు వెర్షన్ శాటిలైట్ హక్కుల 21 కోట్లతో ప్రముఖ ఛానల్ జెమిని సొంతం చేసుకుందంటున్నారు.
మరి ఈ రేటు ఇప్పటివరకు ఏ ఒక్క తెలుగు సినిమాకి రాలేదని.... ఇప్పుడు పవన్ చిత్ర శాటిలైట్ హక్కులే ఆల్టైమ్ రికార్డు అని... ఈ రకంగా పవన్ సినిమా చరిత్ర సృష్టించిందనే న్యూస్ ఇప్పుడు పవన్ ఫాన్స్ ని ఖుషి ఖుషి చేస్తుంది. మరి ఈ చిత్రానికి ఇంత భారీ క్రేజ్ రావడానికి కారణం పవన్ మాత్రమే కాదు... త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో ప్రాజెక్ట్ కావడం... ఇంతకుముందు వీళ్ళ కాంబోలో తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రం చాలా సినిమా యూట్యూబ్ లో లీకైనప్పటికీ ఆ సినిమా విడుదలైన అన్నిచోట్లా సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాదు రికార్డు కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ రావడమే కాదు శాటిలైట్ మార్కెట్లోనే అదిరిపోయే రేటు రాబట్టి పవనుకున్న ఫాలోయింగ్ ని మరింత పెంచేసింది. మరి తెలుగుకి, హిందీకి కలిపి 33 కోట్లు శాటిలైట్ హక్కుల ద్వారా ఈ చిత్రానికి వచ్చింది అంటే ఈ సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ నటిస్తుండగా..... కీలక పాత్రల్లో ఖుష్బూ, ఇంద్రజ లు నటిస్తున్నారు.