>అల్లు అర్జున్ ఈ మధ్యన 'దువ్వాడ జగన్నాథం' చిత్రంతో కాస్త భంగపడ్డాడు. 'డీజే' చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ.... రికార్డు కలెక్షన్స్ వచ్చాయని ఫేక్ న్యూస్ క్రియేట్ చేసినట్లు వార్తలు రావడంతో మెగా ఫాన్స్ దగ్గర అల్లు అర్జున్ కి బ్యాడ్ నేమ్ వచ్చేసిందనే ఫీలింగ్ అందరిలో కలిగింది. ఇప్పటికే పవన్ ఫాన్స్ తో ఇబ్బందులు ఎదుర్కుంటున్న అల్లు అర్జున్ ఇప్పుడు తాజాగా 'డీజే' విషయంలో మెగా ఫాన్స్ నుండి నెగటివ్ ఒపీనియన్ మూటగట్టుకోవడంతో అల్లు అర్జున్ ఇప్పుడు జాగ్రత్తపడుతున్నాడట. ప్రతి విషయంలోనూ బాగా కేర్ తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతుంది.
>అందుకే వక్కంతం వంశి తో మొదలు పెట్టిన 'నా పేరు సూర్య' విషయంలో ఇపుడు జాగ్రత్తలు ఎక్కువయ్యాయట. 'నా పేరు సూర్య' ఎట్టిపరిస్థితుల్లోనూ విజయం సాధించాలని... డైరెక్టర్ గా పరిచయమవుతున్న వక్కంతం వంశీకి అల్లు అర్జున్ అల్టిమేటం జారీ చెయ్యడంతో వక్కంతం కాస్త ఒత్తిడికి గురవుతున్నట్టు కూడా చెబుతున్నారు. 'డీజే' తో ఇబ్బంది పడ్డ బన్నీ ఈ సినిమాతో ఆ నెగెటివ్ టాక్ నుండి బయటపడాలనే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక బన్నీ చెప్పినట్లే వక్కంతం ముందుగా తాను రాసుకున్న స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
>అలాగే ఇప్పుడు మెగా ఫాన్స్ అల్లు అర్జున్ పై గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది కాబట్టి అందరి కళ్ళు ఆయన మీదే ఉండడంతో ఈ సినిమాపై అతి జాగ్రత్తలు వక్కంతం కూడా తీసుకుంటున్నాడనే టాక్ కూడా ఉంది. అలాగే అల్లు అర్జున్ ఈ సినిమా కోసం మిలటరీ ఆఫిసర్ పాత్రలో ఒదిగిపోవాలంటే ఫుల్ గా మేకోవర్ అవ్వాలనే ప్రయత్నాల్లో కూడా వున్నాడు. మరి మొదటిసారిగా డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న వక్కంతం ఈ ఒత్తిడిని తట్టుకుని 'నా పేరు సూర్య'తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో వెయిట్ అండ్ సి.
Allu Arjun Special Carring on Naa Peru Surya Naa Illu India: