ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్‌బాబు -మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రెయిట్‌గా రూపొందుతున్న 'స్పైడర్' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తెలుగుతోపాటు తమిళంలో కూడా ఏకంగా లైకాసంస్థ ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయనుండటం, భారీస్థాయిలో ఏకంగా విడుదలకు ముందే 200కోట్ల బిజినెస్ చేయడం, మురుగదాస్‌కి ఉన్న గుడ్‌విల్‌కి, మహేష్ క్రేజ్, ఇమేజ్ తోడవ్వడంతో ఈ చిత్రం అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఇక ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో మెయిన్ విలన్‌గా తమిళ క్రేజీ దర్శకుడు ఎస్.జె.సూర్య.. పవన్ చిత్రం డైరెక్షన్ చాన్స్‌ని కూడా వదిలేసి నటిస్తుండగా, మరో యంగ్ విలన్‌గా 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భరత్ ఈ చిత్రం గురించి తన మాటల్లో ఎన్నో విశేషాలు చెప్పేశాడు. ఈ చిత్రం షూటింగ్ మొదలైన 10రోజుల తర్వాత మురుగదాస్ ఫోన్ చేసి స్క్రిప్ట్ చెప్పారు. తెలుగులో స్ట్రెయిట్ చిత్రం కావడం, అందునా సూపర్‌స్టార్ మహేష్‌బాబు చిత్రం కావడంతో వెంటనే ఓకే చెప్పేశాను. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ విషయంలో మహేష్‌బాబు, మురుగదాస్‌లు ఎంతో సహనంతో నాకు సహకరించారు.
ఈచిత్రంలో రోలర్ కోస్టర్‌పై నాకు మహేష్‌కి మధ్య ఓ యాక్షన్ సీన్ ఉంది. ఈ ఫైట్‌ని పీటర్ హెయిన్స్ 15రోజుల పాటు చిత్రీకరించారు. ఈచిత్రంలో ఈ యాక్షన్ సీన్ హైలైట్‌గా ఉంటుంది. ఇక ఈచిత్రం వరకే నేను విలన్‌ని, ఇకపై విలన్ పాత్రలు ఏ చిత్రంలో వచ్చినా నిర్మోహమాటంగా నో చెప్పేస్తాను.. హీరోగా రాణించడమే నా లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్.