తెలంగాణలో టిడిపికి పెద్దగా ఉనికి లేనప్పటికీ ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్‌రెడ్డే తురుపుముక్క అని చెప్పాలి. కాంగ్రెస్‌లో పాటు ఆ పార్టీ నాయకుడు పెట్టని విధంగా తన మాటల చాకచ్యంతో రేవంత్ టీఆర్‌ఎస్‌ని, కేసీఆర్‌ని ఇబ్బందులు పెడుతున్నాడు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేకెత్తిస్తున్నాయి. సమైక్యాంధ్ర హయాంలో తమ టిడిపి పార్టీ హైదరాబాద్‌ని ఐటీ హబ్‌గా మారిస్తే టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణను మూడేళ్లల్లో పబ్బులు, క్లబ్‌లతో నింపేసిందని దుయ్యబట్టాడు.
తాము అధికారంలో ఉన్న రోజుల్లో హైదరాబాద్‌లో కనీసం 10 పబ్‌లు కూడా లేవని, కానీ టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 57 కొత్త పబ్బులకు అనుమతించిందన్నాడు. ఇక కర్ణాటక, మహారాష్ట్రలు నిషేదం విధించిన ఫ్రెంచ్ డిజె కి కేసీఆర్ తమ రాష్ట్రంలోకి ఆహ్వానం పలికి, టూరిజం శాఖ ద్వారా కోట్లాది నిధులను దానికి మరలించాడన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాలన్నీ పబ్‌లతో నిండిపోయి ఉన్నాయని చెప్పాడు.
సీఎం కేసీఆర్ బందువు, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ వియ్యంకుడైన రాజేంద్ర ప్రసాద్ పాకాల ఈవెంట్స్ నౌ అనే సంస్థను స్థాపించిన నిషేధ డిజెలను ఏర్పాటు చేయడం, ఆయా డిజెలలో మందుతాగుతూ, డ్రగ్స్ సేవిస్తూ తూలుతూ, చిందులేసే షోలకు 15ఏళ్ల స్కూల్ పిల్లలను కూడా అనుమతిస్తున్నాడని, డ్రగ్స్ కేసులో ఉన్నవారు తన బంధువులైనా వదిలిపెట్టేది లేదని చెబుతున్న కేసీఆర్ తాము చూపించిన సాక్ష్యాలను ఎందుకు విస్మరిస్తున్నారు? ప్రముఖులనైనా వదలం అంటూనే ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకుల్ సబర్వాల్‌ని పేర్లు బయట పెట్టవద్దని ఒత్తిడి చేస్తోంది ఎవరో అందరికీ తెలుసునని, అకున్ సబర్వాల్‌ని ఒత్తిడి చేసే అవకాశం స్థాయి ఎవరికి ఉన్నాయో అర్ధమవుతోందని ఆయన పేల్చినడైలాగ్‌లు వింటే కేసీఆర్ అండ్ కోకి ఇబ్బందులు తప్పవని అర్ధమవుతోంది.