నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'లై'. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో నితిన్ సరసన నటిస్తున్న మేఘ ఆకాష్ టాలీవుడ్ కి మొదటిసారి పరిచయం కాబోతుంది. ఈ మధ్యన వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న నితిన్ 'లై' సినిమాకి భారీ అంచనాలే ఉన్నాయి. అందులోను సక్సెస్ ఫుల్ డైరెక్షర్ హను రాఘవపూడి - నితిన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక 'లై' టీజర్ కూడా సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడేలా చేసింది. సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్టర్స్ దగ్గర నుండి, టీజర్, సింగిల్ పాటలు కూడా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక 'లై' సినిమాని ఆగష్టు 11 న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో 'లై' చిత్రం ఆగష్టు 11 కి రావడంలేదని... అదేరోజు రానా 'నేనే రాజు - నేనే మంత్రి', బోయపాటి 'జయ జానకి నాయక' వంటి సినిమాల విడుదల ఉండడంతో వెనక్కి తగ్గారనే ప్రచారం మొదలైంది. ఇప్పటివరకు టీజర్, సింగిల్స్ తో సందడి చేస్తున్న 'లై' ఎటువంటి పబ్లిక్ ఫంక్షన్ ని కండక్ట్ చేయకపోవడంతో ఈ న్యూస్ నిజమేనా అన్నట్టు ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ 'లై' పోస్ట్ పోన్ విషయం 'లై' చిత్ర యూనిట్ వద్దకు చేరగా... 'లై' వాయిదా విషయాన్ని ఖండించింది యూనిట్. ఎట్టిపరిస్థితుల్లోనూ 'లై' ఆగష్టు 11 నే వస్తుందని... 'లై' పోస్ట్ పోన్ అయ్యిందని ప్రచారం అవుతున్న వార్తలో ఎటువంటి నిజం లేదని... అలాంటి పుకార్లను నమ్మొద్దని వారు చెప్పారు. అలాగే నితిన్ ఈసినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంటాడనే ధీమా వ్యక్తం చేస్తుంది చిత్ర యూనిట్.