తెలుగులో కమెడియన్లుగా ఉంటూనే హీరోలుగా రాణించిన వారు చాలా తక్కు వ మందే ఉన్నారు. అయితే అటు కామెడీ పాత్రలను వదలకుండా, అప్పుడప్పుడు హీరోలుగా రాణించిన వారే అందులో అధికం. నాటి రమణారెడ్డి, రేలంగి, అలీ,బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, వేణుమాదవ్, సునీల్, సప్తగిరి, ధన్‌రాజ్, బాబు మోహన్ ఇలా ఎందరో ఉన్నారు. అయితే కేవలం హీరోలుగా అయితే ఇక కష్టమని, కాబట్టి కామెడీ రోల్స్‌ని కూడా చేయాలని అలీ, బ్రహ్మానందం వంటివారు నిర్ణయించుకున్నారు.
ఇక సునీల్ అయితే కేవలం హీరోగానే పిక్స్ అయి అటు ఇటు కాకుండా అయిపోయాడు.కానీ సప్తగిరి మాత్రం తన అమాయకమైన ఫేస్‌తో, డిఫరెంట్ డైలాగ్ డెలివరితో కమెడియన్‌గా రాణిస్తూనే, మరోవైపు హీరోగా తనకి తగ్గ పాత్రలు వస్తే చేస్తున్నాడు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'కి 'కాటమరాయుడు' అని టైటిల్ పెట్టి, పవన్ అడిగిన వెంటనే ఆ టైటిల్‌ని ఆయనకి ఇచ్చేసి, ఆయన అభిమానం పొందాడు. ఈ చిత్రం వేడుకకు పవన్ వచ్చి మరీ శుభాకాంక్షలు చెప్పడంతో ఈ చిత్రం డీసెంట్‌గానే ఆడింది. ప్రస్తుతం మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇక ఆగష్టు 5న ఆయన హీరోగా నటించనున్న మరో చిత్రం ప్రారంభం కానుంది.
గతంలో బాలకృష్ణతో 'విజయేంద్ర వర్మ' తీసి డిజాస్టర్ ఫలితాన్ని పొందిన దర్శకుడు స్వర్ణ సుబ్బారావు ఆ తర్వాత న్యూమరాలజీ, ఆస్ట్రాలజీలను నమ్మి పేరును మార్చుకుని నందమూరి కళ్యాణ్‌రామ్‌తో 'హరే రామ్' తీశాడు. ఇది ఓకే అనిపించుకుంది. ఇక సప్తగిరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ఆయన ఎంతో గ్యాప్ తర్వాత మరోసారి మెగాఫోన్ పట్టుకోనున్నాడు. మరి సప్తగిరి ఈ సినిమాకు నందమూరి హీరోలను ప్రచారానికి వాడుకుంటాడా? లేక పవన్ చెంతనే ఉంటాడా? అనేది వేచి చూడాల్సిఉంది.