Advertisementt

ఆగష్టు నెల అంతా సందడే.. సందడీ..!

Thu 03rd Aug 2017 07:25 PM
jaya janaki nayaka,lie,yuddham saranam,nakshtram,dharshakudu,nene raju nene manthri  ఆగష్టు నెల అంతా సందడే.. సందడీ..!
August Month Releasing Movies Updates! ఆగష్టు నెల అంతా సందడే.. సందడీ..!
Advertisement
Ads by CJ

సినిమాలకు ఫిబ్రవరి నెల, ఆగష్టు నెలలో బాగా గిరాకీ ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతికి పెద్ద సినిమాలు దిగిపోతే చిన్న సినిమాలన్నీ ఫిబ్రవరికి షిఫ్ట్ అవుతాయి. అలాగే మే, జూన్ లలో విడుదల కావాల్సిన పెద్ద సినిమాలు, చిన్న సినిమాలన్నీ ఆగష్టు నెలనే చూజ్ చేసుకుంటాయి. మరి ఆగష్టు లో విపరీతమైన వీకెండ్ సెలవులతో పాటే శ్రావణ శుక్రవారం, రక్షాబంధన్, కృష్ణాష్టమి, ఆగష్టు 15 సెలవలు ఉంటాయి గనక ఈ నెలలో అత్యధిక సినిమాలు విడుదలకు సిద్దమవుతుంటాయి. ఇపుడు తాజాగా ఆగష్టు మంత్ కి వెల్ కమ్ చెప్పబోతున్నారు కొంత మంది దర్శక నిర్మాతలు. ఆగష్టు నాలుగున మొదలైన సినిమాల జాతర మళ్లీ ఆగష్టు 25  వరకు అలానే కొనసాగుతుంది.

ఇక ఆగష్టు నాలుగున సుకుమార్ బ్యానర్లో తెరకెక్కిన 'దర్శకుడు', కృష్ణ వంశీ డైరెక్షన్ లో సందీప్ కిషన్, రెజినా, సాయి ధరమ్ తేజ, ప్రగ్య జైస్వాల్ ల 'నక్షత్రం' వున్నాయి. ఈ 'నక్షత్రం' పై భారీ అంచనాలున్నాయి. ఇక 'దర్శకుడు' చిత్రాన్ని కూడా పలువురు సెలబ్రిటీస్ తో సుకుమార్ పబ్లిసిటీ స్టెంట్ నిర్వహించిన విషయం తెలిసందే. ఆ రకంగానూ ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.

ఇక ఆగష్టు లో అతిపెద్ద వారం ఆగష్టు 11 . ఈ తేదీన మూడు భారీ బడ్జెట్ సినిమాలు దిగబోతున్నాయి. 

నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన 'లై' చిత్రం విడుదలకు సిద్దమవగా... రానా హీరోగా కాజల్, కేథరిన్ లు హీరోయిన్స్ గా తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రం కూడా ఆగష్టు 11  బరిలో ఉంది. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రకుల్ హీరోయిన్ హీరోయిన్ గా తెరకెక్కిన 'జయ జానకి నాయక' చిత్రం కూడా ఆగష్టు 11  బరిలో నిలిచి ఆ రెండు చిత్రాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఇక మూడో వారం ఆగష్టు 18 న తాప్సీ నటించిన 'ఆనందో బ్రహ్మ' చిత్రంతో పాటే... ఎన్నాళ్ళ నుండో విడుదలకు నోచుకోని 'ఉంగరాల రాంబాబు' కూడా అదే రోజు థియేటర్స్ లోకి దిగిపోనుంది.  'ఉంగరాల రాంబాబు' చిత్రంలో సునిల్ హీరోగా నటించాడు.

ఇక నాలుగో వారం అంటే ఆగష్టు 24న నాగ చైతన్య నటించిన 'యుద్ధం శరణం'... అలాగే అజిత్ - కాజల్ హీరో హీరోయిన్స్ గా నటించిన  తమిళ డబ్బింగ్ చిత్రం 'వివేగం' కూడా అదే రోజు విడుదల చేస్తున్నారు. ఇక పోతే ఆగష్టు 25 న 'పెళ్ళి చూపులు' ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి విడుదలవుతుండగా.... అల్లరి నరేష్ హీరోగా వస్తున్న  'మేడ మీద అబ్బాయి' ని రిలీజ్ చేస్తున్నారు. మరి ఆగష్టు మంత్ అంతా చిన్న పెద్ద హీరోల సందడితో అదిరిపోనుందన్న మాట. ఇక ఈ సినిమాల్లో ఎన్ని విజయం సాధిస్తాయో ఆగష్టు మంత్ ఎండింగ్ లో తెలుసుకుందాం..!

August Month Releasing Movies Updates!:

Tollywood movies releasing Dates and movies Names in August month Updates.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ