తెలుగులో అవకాశాలు సరిగ్గా రాక తమిళంలో ఎంట్రీ ఇచ్చిన సీతమ్మ 'అంజలి', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా' చిత్రాలతో పాటు బాలయ్య సరసన ఆ తర్వాత ఒకటి రెండు ఐటమ్ సాంగ్స్‌లో కూడా మెరిసింది. 'గీతాంజలి' అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంలో కూడా మెప్పించింది. ఇక 'ప్రేమ కథా చిత్రమ్' ఫేమ్ నందిత, కలర్స్ స్వాతి, నటుడు ఉత్తేజ్ కూతురు చేతన, అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన సుప్రియ, మెగా కాంపౌండ్ హీరోయిన్ నిహారిక, ఘట్టమనేని ఇంటి మంజుల.. ఇలా ఎందరో ఈమద్య కాలంలో బయటకు వస్తున్నారు.
ఇక ఒకప్పుడు జయప్రద, జయసుధ, విజయశాంతి వంటి వారు కూడా మనవారే. త్వరలో రాజశేఖర్ - జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ తెరంగేట్రం చేయనుంది. చిన్నకూతురు శివాత్మిక కూడా లైన్లో ఉంది. ఇక కొందరు రాణించలేకపోయినా మిగిలిన వారు తమ పరిధిలో తాము రాణిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా సుకుమార్ నిర్మాతగా, సుకుమార్ రైటింగ్స్ బేనర్‌లో హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో సుకుమార్ అన్న కుమారుడు అశోక్ హీరోగా రూపొందుతున్న 'దర్శకుడు' చిత్రంలో తెలుగమ్మాయి ఇషా బాగానే నటిచిందని టాక్ వస్తోంది.
వాస్తవానికి ఇంద్రగంటి మోహనకృష్ణ తీసిన 'అంతకు ముందు ఆ తర్వాత', 'బందిపోటు, అమీతుమీ'లతో పాటు 'మాయామాల్'లో కూడా ఈమె గతంలో నటించింది. ఇక ఇంద్రగంటి మోహనకృష్ణ స్వాతిరెడ్డికే కాదు... అకాలంగా మరణించిన భార్గవి అనే నటికి కూడా 'అష్టాచెమ్మా'లో సెకండ్ హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది. ఈమె కూడా తెలుగమ్మాయే. ఇక మధుశాలిని, తేజస్వి మదివాడ వంటి వారు ఎక్స్‌పోజింగ్‌కు కూడా సై అంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం తెలుగులో హీరోయిన్లకు మంచి అవకాశాలొస్తున్నాయి.
సాయి పల్లవి, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్, నివేదా థామన్, అనుపమ పరమేశ్వరన్ వంటి వారు ఎక్స్‌పోజింగ్‌తో కాక నటనతో ఆకట్టుకుంటున్నారు. సో.. మంచి అందగత్తెలై ఉండి శృంగార భావాలను దుస్తుల్లో కాకుండా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే చూపించే నటనా ప్రతిభ ఉన్నవారికి ఇది హీరోయిన్లుగా నిలదొక్కుకోవడానికి సరైన సమయంగా చెప్పుకోవాలి..!