యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న 'బిగ్ బాస్ ' షో అనుకున్న దానికంటే గొప్పగా క్లిక్ అయ్యింది. ఎన్టీఆర్ వచ్చే రోజన రేటింగ్స్ అదిరిపోతున్నాయి అని చెబుతున్నారు. కానీ ఈ షో లో మాత్రం పైకి ఒకటి చెబుతున్నారు. లోపల మాత్రం ఇంకోటి చేస్తున్నారు. అది ఏమిటి అంటారా? లాంగ్వేజ్.
ఓన్లీ తెలుగు మాత్రమే మాట్లాడాలని బిగ్ బాస్ చెబుతుంటే, ముమైత్, అర్చన, కొత్తగా వచ్చిన దీక్షా వారితోపాటు మిగతా కుటుంబ సభ్యులు ఎదో ఒక టైమ్ లో తెలుగు కాకుండా ఇతర లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. దీని పై బిగ్ బాస్ కూడా సీరియస్ అవుతూనే ఉన్నాడు. రీసెంట్ గా ముమైత్ నోటికి ప్లాస్టర్ కూడా వేశారు. అయినా ముమైత్ ఏం మారలేదు.
సరే వీళ్ల సంగతి ఇలా ఉంటే, అసలు బిగ్ బాస్ కూడా తప్పు చేస్తున్నాడు. 'టాస్క్', 'లజ్జ్జరి బడ్జెట్' వంటి ఇంగ్లీష్ పదాలను బిగ్ బాస్ కూడా ఉపయోగిస్తున్నాడు. మరి దీని పై బిగ్ బాస్ ఏం అంటాడో గాని... ఆ పదాల ప్లేస్ లో తెలుగు పదాలు వాడి, బిగ్ బాస్ ముందు తెలుగు కు ఇంపార్టెన్స్ ఇస్తే... మిగిలిన కుటుంబ సభ్యులు కూడా మారే అవకాశం ఉంటుంది.