Advertisementt

ఫ్రెండ్‌షిప్‌డే గిఫ్ట్‌ అదిరింది..!

Sun 06th Aug 2017 04:01 PM
hero ram,unnadi okate zindagi movie,director kishore thirumala  ఫ్రెండ్‌షిప్‌డే గిఫ్ట్‌ అదిరింది..!
Unnadi Okate Zindagi Movie Song Released ఫ్రెండ్‌షిప్‌డే గిఫ్ట్‌ అదిరింది..!
Advertisement
Ads by CJ

'నేను..శైలజ' వంటి హిట్‌ తర్వాత 'హైపర్‌'తో దెబ్బతిన్న రామ్‌ ఎందరితో చిత్రాలు తీయాలని భావించి, చివరకు కరుణాకరన్‌ని కూడా పక్కనపెట్టి తనకు 'నేను శైలజ' వంటి హిట్‌ ఇచ్చిన కిషోర్‌ తిరుమలతోనే చేస్తున్న చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. టైటిల్‌ క్యాచీగా ఉండటంతో ప్రేక్షకులను మరీ ముఖ్యంగా యువతకు తెగ నచ్చేసింది. ఇక ఈ రోజు ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ఈ చిత్రంలోని పోస్టర్‌తో పాటు 'ట్రెండు మారినా ఫ్రెండు మారడు' అనే పాటను రిలీజ్‌ చేశారు. 

పోస్టర్‌లో సముద్రపు ఒడ్డున బీచ్‌లో రామ్‌ తన ఫ్రెండ్స్‌తో కలసి జీప్‌లో వెళ్తున్న లుక్‌ని విడుదల చేశారు. ఇక ఈ చిత్రంలోని దేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచిని 'ట్రెండు మారినా ఫ్రెండు మారడు' అనే పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈచిత్రంలో రామ్‌ లుక్‌, స్టైల్‌, బాడీలాంగ్వేజ్‌ వంటివన్నీ విభిన్నంగా ఉంటాయని నిర్మాత స్రవంతి రవికి షోర్‌ అంటున్నాడు. ఈచిత్రం ఫ్రెష్‌ కాన్సెప్ట్‌తో తీస్తున్న సబ్జెక్ట్‌ అని, ప్రతి పాత్రా లవ్లీగా ఉంటుందని, ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఏదో ఒక క్యారెక్టర్‌లో తమని తాము ఐడెంటిఫై చేసుకుంటారని కిషోర్‌ తిరుమల అంటున్నాడు. 

దేవిశ్రీప్రసాద్‌ సంగీతంతో పాటు యువ హీరో శ్రీవిష్ణు, 'పెళ్ళి చూపులు' ఫేమ్‌ ప్రియదర్శి పాత్రలు కూడా ఎంతో బాగుంటాయని అంటున్నారు. ఈఏడాది చివరలో రిలీజ్‌ చేయాలని భావిస్తున్న ఈచిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా, కృష్ణ చైతన్య సమర్పణలో, స్రవంతి మూవీస్‌ సంస్థ. పి.ఆర్‌. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

'నేను.. శైలజ' తర్వాత మరోసారి రామ్‌కి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇదని, ఇక తమ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలను ఈ చిత్రం రీచ్‌ అవుతుందని రామ్‌, స్రవంతి రవికిషోర్‌, కిషోర్‌ తిరుమలలు ఘంటాపథంగా చెబుతున్నారు. 

Unnadi Okate Zindagi Movie Song Released:

Hero Ram Pothineni New Starring Movie 'Unnadi Okate Zindagi' Director by Kishore Tirumala.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ