'లై' సినిమాతో భారీ హిట్ కొట్టడానికి నితిన్, హను రాఘవాపుడితో కలిసి పక్కా ప్లాన్ చేశాడు. సినిమా మీద నమ్మకంతోనే రెండు భారీ సినిమాలు ఆగష్టు 11 న రేసులో ఉన్నా కూడా తెగించి థియేటర్స్ లోకి రావడానికి సిద్దమయ్యాడు. ఇకపోతే సినిమాకి ఫస్ట్ లుక్ విడుదలైన అప్పటి నుండి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు 'లై' టీజర్ తో మరింత ఎక్కువైంది. టీజర్ లోనే స్టైలిష్ లుక్ తో అదరగొట్టిన నితిన్ ఇప్పుడు తాజాగా థియేట్రికల్ ట్రైలర్ తో సందడి చేస్తున్నాడు. గత రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న 'లై' చిత్రం...... ఆ ఈవెంట్ లోనే ట్రైలర్ ని కూడా లాంచ్ చేశారు.
ట్రైలర్ చూస్తున్నంత సేపు ఆసక్తిగా అనిపిస్తుంది. 'లై' సినిమాలో అన్ని అబద్దాలే. హీరో హీరోయిన్స్ ఇద్దరూ అబద్దాలు మాట్లాడతారు. అబద్దాలు మాట్లాడుతున్నంత సేపు మాములుగా ఉన్నా ఆ తరవాత మాత్రం లవ్ లో పడతారు. అసలు అబద్దాలు మాట్లాడినా నేను ప్రేమలో పడ్డా చూశావా అని హీరోయిన్ అంటే.... అసలు బద్దలకే అమ్మాయిలు తొందరగా పడతారని... సత్యం (నితిన్) చెప్పడం చూస్తుంటే మాత్రం సినిమాపై తెగ ఇంట్రెస్ట్ పుట్టేస్తుంది. ఇక విలన్ గా అర్జున్ చంపేశాడు. స్టైలిష్ విలన్ గా అర్జున్ విశ్వరూపం చూపెట్టాడని మాత్రం అర్ధమవుతుంది.
ట్రైలర్ ఆసాంతం అల్లరించిందనడంలో సందేహం లేదు. 'లై' సినిమాని ట్రైలర్ లో మరో భీబత్సం మణిశర్మ మ్యూజిక్. చాలా రోజుల తర్వాత మణిశర్మ మ్యూజిక్ అదరగొట్టేశాడనిపిస్తుంది. యువరాజ్ ఫోటోగ్రాఫి ఈ సినిమాకు మెయిన్ హైలైట్స్. కొత్తగా ఒక లవ్ స్టోరీని చెబుతూ.. అందులో మాఫియా టచ్.. బాగానే ఇచ్చారు. మరి నితిన్ నమ్మకాన్ని 'లై' సినిమా నిలబెడుతుందనే ఆశిద్దాం.