Advertisementt

'లవ' సింపుల్ గా ఉన్నాడు..!

Tue 08th Aug 2017 11:16 AM
jr ntr,jai lava kusa movie,lava first look,bobby,kalyan ram  'లవ' సింపుల్ గా ఉన్నాడు..!
Jr NTR 'Jai Lava Kusa Movie' 'Lava' First Look 'లవ' సింపుల్ గా ఉన్నాడు..!
Advertisement
Ads by CJ

'జై లవ కుశ' లో 'జై' గా తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసిన ఎన్టీఆర్ ఇపుడు 'జై లవ కుశ' లోని 'లవ' గా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. 'జై' లో కోపం, ద్వేషం, పగ, ధైర్యం వంటి వాటితో రచ్చ రచ్చ చేశాడు ఎన్టీఆర్. ఎవరూ పూజించని రావణసురుణ్ణి పూజిస్తూ వెరైటీగా ఆకట్టుకున్నాడు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.  ఈచిత్రంలో ఎన్టీఆర్ 'జై, లవ, కుశ' గా మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ లో 'జై' ని పరిచయం చేసిన బాబీ ఇప్పుడు సెకండ్ లుక్ లో 'లవ' ని దింపాడు.

మరి లవ లుక్ లో ఎన్టీఆర్ చాలా స్టైల్ గా, సాఫ్ట్ గా, సింపుల్ లుక్ లో కనిపిస్తున్నాడు. మరి బ్యాంకు మేనేజర్ అంటే ఇలానే ఉండాలి అనే రీతిలో 'లవ' లుక్ ని డిజైన్ చేశారు. అయితే 'లవ' లుక్ లో ఎన్టీఆర్ సాఫ్ట్ లుక్ ని చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యారనే టాక్ వినబడుతుంది. ఎన్టీఆర్ ని అందరూ మాస్ లుక్ లో చూడాలనే అనుకుంటారు. మరీ ఇలా సాఫ్ట్ లుక్ లో చూడడానికి పెద్దగా ఇష్టపడని ఫ్యాన్స్ ఇలా కొంచెం డిస్పాయింట్ గా ఫీలవుతున్నారు. 'జై' కేరెక్టర్ లో రౌద్రాన్ని పరిచయం చేసిన బాబీ 'లవ' కేరెక్టర్ ని సింపుల్ గా కూల్ గా ఉండేలా సెట్ చేశాడు.

మరి జస్ట్ లుక్ కోసమే ఇంతిలా డిస్కర్షన్ జరుగుతుంటే ఇక 'లవ' టీజర్ వస్తే ఇంకెలా ఉంటుందో కదా... ఇకపోతే 'జై', 'లవ' బయటికి వచ్చేశారు. మరి 'కుశ' ని మనకెప్పుడు పరిచయం చేస్తాడో డైరెక్టర్ గారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేత థామస్ లు నటిస్తుండగా.... దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  

Jr NTR 'Jai Lava Kusa Movie' 'Lava' First Look:

Jr NTR acted movie 'Jai Lava Kusa' Director by Bobby this movie Lava character first look released.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ