Advertisementt

ఎంత నమ్మకమైనా.. అదేం భాష నాయనా..!

Tue 08th Aug 2017 07:32 PM
vijay devarakonda,nani,arjun reddy movie,trailer  ఎంత నమ్మకమైనా.. అదేం భాష నాయనా..!
Vijay Devarakonda New Movie Arjun Reddy ఎంత నమ్మకమైనా.. అదేం భాష నాయనా..!
Advertisement
Ads by CJ

'పెళ్లిచూపులు' సూపర్‌హిట్‌ కావడంతో ఈ చిత్రంలో నటించిన హీరో విజయ్‌ దేవరకొండ ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు. అంతకు ముందు రెండుమూడు చిత్రాలలో నటించినా ఆయనకు ఎలాంటి గుర్తింపురాలేదు. కాగా ప్రస్తుతం ఆయన 'అర్జున్‌ రెడ్డి'అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం ఫస్ట్‌లుక్‌, టీజర్‌తో పాటు ట్రైలర్‌ కూడా ఎంతో బాగుండటంతో విజయ్‌ దేవరకొండ ఆనందానికి అవదుల్లేవు. ఈ చిత్రం థియేటికల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకలో ఏకంగా సూపర్‌హిట్‌ అని కాదు.. ఏకంగా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నమ్మకంతో బల్లగుద్ది చెప్పాడు. 

ఈ చిత్రం ట్రైలర్‌ మూడు నిమిషాలకు మించి ఉన్నా కూడా ఇంకొన్ని సీన్స్‌ వుంటే బాగుండేదని ప్రేక్షకులతో పాటు అందరూ అంటున్నారని, ఈ చిత్రం విజయానికి ఇంత కంటే ఏం రుజువులు కావాలి? అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. కానీ టీజర్లు, ట్రైలర్స్‌ బాగా ఆకట్టుకున్నా సినిమాలో దమ్ములేక ఆడని చిత్రాలు అనేకం ఉన్నాయి. ఇక ఈ విషయం పక్కనపెడితే విజయ్‌ దేవరకొండ ఈచిత్రం బ్లాక్‌బస్టర్‌ కాదని ఎవరైనా పందెం కడితే తాను సిద్దమేనని, నా అకౌంట్‌లో ఉన్నదంతా బెట్‌ కట్టడానికి నేను రెడీగా ఉన్నాను. ఇదో గుడ్‌ఫిల్మ్‌, నటునిగా నాకు బాగా సంతృప్తినిచ్చిన చిత్రం. అందుకే ఈ చిత్రం డెఫినెట్‌గా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నమ్మకంతో చెబుతున్నానని చెప్పాడు. 

'బాహుబలి-2'ని కొని విడుదల చేసిన సునీల్‌ నారంగ్‌ ఈచిత్రం థియటికట్‌ రైట్స్‌ని భారీమొత్తానికి తీసుకున్నాడని, సినిమా చూసి బ్లాక్‌బస్టర్‌ అవుతుందనే నమ్మకంతోనే ఆయన 'అర్జున్‌ రెడ్డి' చిత్రాన్ని తీసుకున్నాడని తెలిపాడు. ఇక బాలీవుడ్‌లోలాగా ఈ వేడుకలో విజయ్‌ దేవరకొండ ముఖ్యఅతిధిగా విచ్చేసిని నేచురల్‌స్టార్‌ నానికి గట్టి ముద్దు ఇచ్చి దీనిని కూడా పబ్లిసిటీలో భాగంగా చేశాడని, హాలీవుడ్‌, బాలీవుడ్‌లలోని కల్చర్‌ని విజయ్‌ దేవరకొండ టాలీవుడ్‌కి తెచ్చాడనే చర్చ సాగుతోంది. 

ఇక ఈ చిత్రం ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో బాగా ట్రేడింగ్‌లో ఉండి నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని చెబుతూ, దేర్‌ వుయ్‌ గో...నీ యమ్మ దెబ్బకు నెం1. ఆగష్టు 25న వస్తున్నాం. అప్పటి వరకు ఇదే పరిస్థితి. బ్లాక్‌బస్టర్‌ హిట్టేనని పోస్ట్‌ చేశాడు. ఆయన వాడిన నీ యమ్మ పదం, నానిని ముద్దుపెట్టుకోవడం వంటి విషయాలలో ఆయనకు కాస్త నెగటివ్‌సెటైర్స్‌ కూడా పడుతుండటం విశేషం. 

Vijay Devarakonda New Movie Arjun Reddy:

Arjun Reddy Movie trailer halchal in Social media Vijay Devarakonda posted There U Go Nee Yamma bebbaku no 1 release august 25th.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ