Advertisementt

ఈ నటుడు మారడా..! కొరటాలతో కూడానా!

Thu 10th Aug 2017 12:16 AM
prakash raj,koratala siva,mahesh babu,bharath anu nenu  ఈ నటుడు మారడా..! కొరటాలతో కూడానా!
Koratala Siva Serious on Prakash Raj ఈ నటుడు మారడా..! కొరటాలతో కూడానా!
Advertisement
Ads by CJ

మంచి ప్రతిభ ఉన్న నటులందరూ మంచి వ్యక్తులు కావాల్సిన పనిలేదు. ఇక ఇలాంటి కోవకి చెందిన విలక్షణ నటుడే ప్రకాష్‌రాజ్‌, ఆయన చెప్పిన సమయానికి, ముందుగా ఇచ్చిన షెడ్యూల్‌కి తగ్గట్లుగా రాడు. వచ్చినా కూడా ఆయనతో ఓ సీన్‌ తీసేసరికి ఆయనను భరించడం కష్టమవుతుందని పలువురు దర్శకనిర్మాతలు చెబుతూ ఉంటారు. నిత్యం వివాదాల్లో ఉండే ఈయన తన ప్రవర్తన కారణంగా అనేక చిత్రాలలో చాన్స్‌లు పోగొట్టుకున్నాడు. 

ఇక రాజమౌళి వంటి దర్శకుడే 'విక్రమార్కుడు'లో ఓ చిన్న పాత్ర ఇచ్చి షూటింగ్‌లో నానా ఇబ్బందులు పడి వదిలేశాడు. ప్రకాష్‌రాజ్‌, శ్రీనువైట్ల సంగతి తెలిసిందే. ఇక ఈయన దెబ్బకు బలైన నిర్మాతల ఒత్తిడితో ఆయనపై ఒకసారి బహిష్కరణ వేటు కూడా పడింది. ఇక నేటి దర్శకులలో కొరటాల శివది డిఫరెంట్‌ స్టైల్‌. ఆయన పెద్దగా ఎవరిని కోపగించుకోడు. ప్రస్తుతం ఆయన 'శ్రీమంతుడు' తర్వాత మహేష్‌బాబుతో రెండో చిత్రం 'భరత్‌ అనే నేను' చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. ఇక ఇందులో మహేష్‌బాబు యంగ్‌ సీఎంగా నటిస్తుండగా మరో కీలకమైన పాత్రకు కొరటాల, ప్రకాష్‌రాజ్‌ని తీసుకున్నాడు. కానీ ఆయన అసలు సమయానికే రావడం లేదట. ఉదయం రావాల్సిన వ్యక్తి, సాయంత్రం బ్రేక్‌ చెప్పే సమయంలో వస్తూ ఉండటం, ఆయన మీద ఒక్క సీన్‌ కూడా తీయకుండానే ప్యాకప్‌లు జరుగుతుండటంతో కొరటాల శివ ఆయనపై ఎంతో కోపంగా ఉన్నాడట. 

ఇప్పటికే ఈ పాత్ర కోసం వేరే వారిని తీసుకోవాలని కొరటాల ఫిక్స్‌ కాగా, దానికి నిర్మాత దానయ్య కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మహేష్‌బాబు కూడా సంప్రదించి, ప్రకాష్‌రాజ్‌ ప్రవర్తనను ఆయనకు కూడా విడమరిచి చెప్పి, తమను ఆయన ఇబ్బంది పెడుతున్న తీరు, ఈ చిత్రాన్ని ఎలాగైనా వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనే పట్టుదలతో ఉండటంతో మహేష్‌ అనుమతితో ఈ పాత్రకు వేరొకరిని తీసుకోనున్నారని తెలుస్తోంది. ఆయన పాత్రలో రావు రమేష్‌ని తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది...! 

Koratala Siva Serious on Prakash Raj:

Prakash Raj is the Mahesh Babu's Bharath Anu Nenu Movie Shooting Delay 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ