'జయ జానకి నాయక' సినిమా గురించి వినగానే ముందుగా బోయపాటి పేరు వస్తుంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఒక చిన్న హీరో అయిన బెల్లంకొండ శ్రీనివాస్ ని డైరెక్ట్ చెయ్యడం అనేది సూపర్ హాట్ న్యూస్. అలాగే టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ శ్రీనివాస్ తో 'జయ జానకి నాయక'లో హీరోయిన్ కావడం అనేది.... మరో సెన్సేషన్. ఇక మూడొవది టాలీవుడ్ లో సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు కొట్టేస్తున్న కేథరిన్ తెరిస్సా ఐటెం సాంగ్ లో నటించడం. మరిన్ని విశిష్టతలతో తెరకెక్కిన ఈ చిత్రంలో మరో హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కూడా ఉందండోయ్. అసలు ఎక్కువగా బోయపాటి, రకుల్, కేథరిన్ ల పేర్లు మాత్రమే హైలెట్ అవుతున్న 'జయ జానకి నాయక'లో బెల్లంకొండ శ్రీనివాస్ పేరుగాని, ప్రగ్యా పేరు గాని పెద్దగా వినబడటం లేదు.
మరి 'జయ జానకి నాయక' లో ప్రగ్య జైస్వాల్ కూడా స్కిన్ షోకి రెడీ అవడమే కాదు.... అందచందాల ఆరబోతతో రెచ్చిపోయింది. ఆమెని కాస్త హైప్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో 'జయ జనకి నాయక' ప్రోమో సాంగ్ ని ఒకదాన్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ ప్రోమో సాంగ్ లో ప్రగ్య జైస్వాల్ 'జస్ట్ చిల్ బాస్' అంటూ అందాలను ఆరబోసింది. బికినీ టాపుల్లో.. బాడీకి హత్తుకునే లోదుస్తుల్లో.. అమ్మడు హాటు హాటుగా పిచ్చెక్కించేసింది. మరి ఈ సాంగ్ ప్రోమోలో ప్రగ్య జైస్వాల్ కూడా ఈ 'జయ జానకి నాయక'లో గ్లామర్ షో తో ఆకట్టుకోనుందని అర్ధమైపోతుంది.
కానీ ప్రగ్య జైస్వాల్ కి ఈ మధ్యన అస్సలు కలిసి రావడంలేదు. ఆమె 'కంచె' సినిమాలో చేసిన నటన కి మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆ సినిమా కమర్షియల్ హిట్టవ్వలేదు. అయితే ప్రగ్య నటించిన 'గుంటూరోడు, ఓం నమో వెంకటేశాయ' చిత్రాల్లో గ్లామర్ షో చేసినప్పటికీ ఆ రెండు సినిమాల ఫలితాలు నిరాశపరిచాయి. ఇకపోతే 'నక్షత్రం' సినిమాలో ప్రగ్య జైస్వాల్ బికినీ తో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసినా.... ఆ సినిమాకి ఆమె గ్లామర్ ఏం హెల్ప్ కాలేదు. మరి ఇప్పుడు 'జయ జానకి నాయక' సినిమా అయినా ప్రగ్యా కి హెల్ప్ అవుతుందో లేదో మరొక్కరోజులో తెలిసిపోతుంది.