Advertisementt

బాలయ్యా...ఎన్టీఆర్ తో పెట్టుకోవద్దు..!!

Fri 11th Aug 2017 12:07 AM
balakrishna,nandamuri taraka ramarao,ntr biopic,rgv  బాలయ్యా...ఎన్టీఆర్ తో పెట్టుకోవద్దు..!!
Balakrishna Dropped NTR Biopic బాలయ్యా...ఎన్టీఆర్ తో పెట్టుకోవద్దు..!!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ అప్పుడెప్పుడో ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తానని... అందులో తానే నటిస్తానని అందరిముందు ఎనౌన్స్ చేశాడు. ఇక బాలయ్య అలా అన్నాడో లేదో ఇలా రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ ని నేనే తెరకెక్కిస్తున్నానంటూ మీడియాలో రచ్చ రచ్చ చేశాడు. కానీ బాలకృష్ణ మాత్రం ఆ విషయంలో పెదవి విప్పకుండా మౌనం వహించాడు. మరి ఒక పక్క సినిమాల్లో దూసుకుపోతున్న బాలకృష్ణ మరోపక్క రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. రెండు పడవల మీద కాళ్లేసినా రెండిటీని చక్కగానే బ్యాలెన్స్ చేస్తున్నాడు. కాకపోతే తన తండ్రి బయోపిక్ ని తెరకెక్కించడం అంటే మాటలు కాదనే విషయం తెలిసినప్పటికీ ధైర్యంగా ఆ సినిమాని చేస్తానంటూ ముందుకొచ్చిన బాలయ్య ఇప్పుడు ఆ విషయంలో మాత్రం మిన్నకుండిపోవడం నందమూరి అభిమానులకు రుచించడం లేదంటూ ప్రచారం మొదలైంది.

మరి బాలకృష్ణ తన తండ్రి జీవితాన్ని తెరకెక్కించడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కథలో కూడా కొన్ని సార్లు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది కూడా. ఇక డైరెక్టర్ గా తీసుకునే వ్యక్తికి ఎన్టీఆర్ జీవిత కథ పూర్తిగా తెలిసిన వాడై ఉండాలి. అలాగే ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనలు చూపించాలంటే మాత్రం ఎంతో ధైర్యం కూడా కావాలి. అసలు ఈ సినిమా మొదలు అయ్యిందని అంటే పెద్ద కాంట్రవర్సీ అవడం ఖాయంగా కనబడుతుంది. సినిమా చేస్తానని చెప్పినప్పుడే చాలామంది తమ బతుకులు ఎక్కడ బయటపడతాయో అని మీడియాకి ఎక్కి మరి ఆ సినిమా చేస్తే ఇలానే చెయ్యాలంటూ వాదించారు. మరి బయట ఇంత జరుగుతున్నా బాలకృష్ణ మాత్రం ఈ ఎన్టీఆర్ బయోపిక్ గురించిన సమాచారం ఇవ్వడంలేదు.

అయితే బాలకృష్ణ ఇలా మౌనం వహించడానికి కారణముందంటున్నారు. బాలకృష్ణ కావాలనే ఎన్టీఆర్ బయోపిక్ ని పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది. ఇక బాలయ్య సన్నిహితులు కూడా ఎన్నికలు మరో రెండేళ్లలో ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైం లో ఎన్టీఆర్ బయోపిక్ అంటూ రోడ్డెక్కడం కరెక్ట్ కాదంటూ సలహాలిస్తున్నారనే టాక్ కూడా వినబడుతుంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ బయోపిక్ ని టచ్ చెయ్యడమంటే వివాదాలను టచ్ చెయ్యడమే అవుతుందని భావించే ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి పక్కన పడేసినట్లు మాత్రం అర్ధమవుతుంది.

Balakrishna Dropped NTR Biopic:

Advises to Nandamuri Balakrishna on NTR Biopic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ