బోయపాటి - బెల్లంకొండ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన 'జయ జానకి నాయక' చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటికి ఉన్న క్రేజ్ తో ఈ సినిమా భారీ అంచనాలతోనే బరిలోకి దిగుతుంది. బోయపాటి మార్క్ స్టయిల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడిగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, కేథరిన్ తెరిస్సా ఒక ఐటెం సాంగ్ లో నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కూడా ఈ చిత్రంలో నటిస్తుంది. నార్మల్ గా బోయపాటి సినిమాలంటే ఇటు యూత్, అటు మాస్‌ని.. ఇంకోవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటాయనే టాక్ ఉంది.
ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలోనే జరిగింది. అయితే ఇప్పుడు 'జయ జానకి నాయక' శాటిలైట్ రైట్స్ కూడా ఊహించని రేంజ్‌కి అమ్ముడుపోయినట్లు చెబుతున్నారు. తెలుగులో స్టార్ మా 5 కోట్లకు శాటిలైట్ రైట్స్‌ని సొంతం చేసుకోగా..... ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ని 7 కోట్లకు సోనీ నెట్‌వర్క్ దక్కించుకున్నట్టు టాక్ వినబడుతుంది. మరి 'జయ జానకి నాయక' చిత్రం శాటిలైట్, హిందీ డబ్బింగ్ హక్కులు ఈ రేంజ్ లో అమ్ముడు పోవడం చూసిన ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారట.
అయితే ఈ సినిమాకి ఛానల్స్ లో అంత హైప్ రావడానికి కారణం మాత్రం డైరెక్టర్ బోయపాటే అంటున్నారు విశ్లేషకులు. ఆయనకున్న ట్రాక్ రికార్డు వలనే ఈ రేంజ్ కి 'జయ జానకి నాయక' అమ్ముడు పోయిందని వారు వాదిస్తున్నారు. శాటిలైట్ రైట్స్ ఈ విధంగా వెళ్లడం రిలీజ్‌కి ముందు నిర్మాతకు బిగ్ రిలీఫ్. అయితే ఈ లెక్కన 'జయ జానకి నాయక' చిత్రం హిట్టయినా ఆ క్రేజ్ అంతా బోయపాటి పట్టుకుపోతాడు. ఇక మిగిలిన బెల్లంకొండ శ్రీనివాస్ కి కేథరిన్ కి ప్రగ్య కి పెద్దగా ఒరిగేదేమి ఉండదు దీని వలన. చూద్దాం సినిమా విడుదలయ్యాక టాక్ ని బట్టి ఏదనేది డిసైడ్ చేస్తే పోలా..!