Advertisementt

ఇంతకీ ఈ మూడింట్లో నిలబడే సినిమా ఏది?

Sun 13th Aug 2017 05:01 PM
lie,jaya janaki nayaka,nene raju nene mantri,1st day collections  ఇంతకీ ఈ మూడింట్లో నిలబడే సినిమా ఏది?
Lie, Jaya Janaki Nayaka, Nene Raju Nene Mantri 1st Day Collections ఇంతకీ ఈ మూడింట్లో నిలబడే సినిమా ఏది?
Advertisement
Ads by CJ

వరుస సెలవులను క్యాష్ చేసుకోవడానికి మూడు భారీ సినిమాలు థియేటర్స్ లోకి దిగిపోయాయి. మూడు సినిమాలు నువ్వానేనా అన్నట్టు పోటీ పడ్డాయి. విడుదల విషయంలో మూడు సినిమాల నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. ఇక మూడు సినిమాల్లో నటించిన హీరోల తండ్రులు కూడా నిర్మాతలే కావడం గమనార్హం. డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాత అయిన సుధాకర్ రెడ్డి కుమారుడు నితిన్, హను రాఘవపూడి డైరెక్షన్ లో 'లై' సినిమాతో సందడి చెయ్యగా, నిర్మాత సురేష్ బాబు కొడుకు రానా సోలో హీరోగా తేజ డైరెక్షన్ లో 'నేనే రాజు నేనే మంత్రి' అంటూ వచ్చేశాడు. ఇక మరో నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బోయపాటి డైరెక్షన్ లో 'జయ జానకి నాయక' అంటూ కుమ్మడానికి వచ్చేశాడు.

మరి ఈ మూడు సినిమాలు మొదటిరోజున దాదాపుగా అన్నీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నాయి. మూడు చిత్రాలు కూడా విడుదలకు పోటీపడ్డట్లే కలెక్షన్ల విషయంలో నువ్వానేనా అన్న రేంజ్‌లో పోటీపడ్డాయి. ఇంతకీ ఫస్ట్ డే వసూళ్లలో ఫస్ట్ ప్లేస్ ఎవరిది? అనే ప్రశ్న ఇపుడు అందరిలో తలెత్తింది.

రానా - కాజాల అగర్వాల్ - కేథరిన్ లు నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా మొదటిరోజు 3 కోట్ల 72 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. ఏరియాల వారీ వసూళ్లు నైజాం-1.22 కోట్లు, ఉత్తరాంధ్ర- 68 లక్షలు, సీడెడ్- 65, ఈస్ట్ గోదావరి-35, కృష్ణ- 28, గుంటూరు-24, వెస్ట్- 20, నెల్లూరు- 10 లక్షలు రాబట్టినట్టు సమాచారం అందుతుంది.

బోయపాటి డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైస్వాల్, కేథరిన్ మరియు భారీ తారాగణం నటించిన 'జయ జానకి నాయక' చిత్రం 3 కోట్ల 27 లక్షలు రాబట్టింది. నైజాం-90 లక్షలు, సీడెడ్- 55, గుంటూరు- 49, ఉత్తరాంధ్ర- 45, వెస్ట్- 28, ఈస్ట్- 24, నెల్లూరు- 20, కృష్ణ- 16 లక్షలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

హను రాఘవపూడి డైరెక్షన్ లో నితిన్ - మేఘ ఆకాష్ జంటగా అర్జున్ విలన్ గా తెరకెక్కిన 'లై' చిత్రం మూవీ థర్డ్ ప్లేస్‌కి వెళ్లినట్టు చెబుతున్నారు. కేవలం 2 కోట్ల 27 లక్షల మాత్రమే లై  మొదటి రోజు కలెక్షన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. నైజాం-81 లక్షలు, సీడెడ్- 42, ఉత్తరాంధ్ర- 32, ఈస్ట్- 21, గుంటూరు-17, కృష్ణ- 17, వెస్ట్- 11, నెల్లూరు- 6 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక ఫస్ట్ డే టాక్ పరంగా ‘నేనే రాజు నేనే మంత్రి’ టాప్ పొజిషన్‌లో ఉంటే...... 'జయ జానకి నాయక' చిత్రం  బీ,సీ సెంటర్లలో,  'లై'.. ఏ సెంటర్లను ఆకట్టుకున్నాయి. అయితే ఈ కలెక్షన్స్ నిర్మాతలకు లాభమా? నష్టమా? అనేది తేల్చాల్సింది మిలిగిన నాలుగు రోజులే అంటున్నారు. చూద్దాం ఫైనల్ విన్నరేవరవుతారో అనేది కొద్దీ రోజుల్లో తేలిపోనుంది.

Lie, Jaya Janaki Nayaka, Nene Raju Nene Mantri 1st Day Collections:

Lie, Jaya Janaki Nayaka and Nene Raju Nene Mantri got Mixed Talk at Box Office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ