Advertisementt

'ఫిదా' ఇన్..'నాన్నకు ప్రేమతో' అవుట్!

Wed 16th Aug 2017 09:31 PM
fidaa,nannaku prematho,us,overseas  'ఫిదా' ఇన్..'నాన్నకు ప్రేమతో' అవుట్!
Fidaa Crosses Naannaku Premantho in US 'ఫిదా' ఇన్..'నాన్నకు ప్రేమతో' అవుట్!
Advertisement
Ads by CJ

'ఫిదా' చిత్రం విడుదలకు ముందు వరుణ్‌తేజ్‌ వరుస ఫ్లాప్‌లలోఉన్నాడు. దర్శకుడు శేఖర్‌కమ్ములది కూడా అదే పరిస్థితి. సాయిపల్లవికి అదే హీరోయిన్‌గా తెలుగులో మొదటి సినిమా. మిగిలిన నటీనటులు, సంగీత దర్శకులు కూడా పేరున్న వారు కాదు. ఈ చిత్రం విడుదలకు ముందు ఉన్న ఏకైక ప్లస్‌ పాయింట్‌ కేవలం నిర్మాత దిల్‌రాజు మాత్రమే. కానీ ఈ చిత్రం విడుదలైన తర్వాత సంచలనం సృష్టించి, బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనాన్నే సృష్టించింది. 

ఎన్ని చిత్రాలు విడుదలైనా ఇప్పటికీ తన కలెక్షన్లను తాను కొల్లగొడుతోంది. ఇక ఇలాంటి వైవిధ్యభరితమైన చిత్రాలు ఓవర్‌సీస్‌లో ఎలా ఆడుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆ వైవిధ్యం అంతా ఈ చిత్రంలో నిండుదనంగా ఉండటంతో 'ఫిదా' ఓవర్‌సీస్‌ ప్రేక్షకులను కూడా ఫిదా చేసేసింది. తాజాగా ఈచిత్రం రెండు మిలియన్ల డాలర్ల క్లబ్‌లో కూడా చేరింది. ఈ చిత్రం రెండు మిలియన్‌డాలర్లను వసూలు చేసిన ఎన్టీఆర్‌- సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం కలెక్షన్లను కూడా దాటేసింది. 

ఈచిత్రం కంటే ముందు 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌', 'బాహుబలి-ది బిగినింగ్‌', 'శ్రీమంతుడు, ఖైదీ నెంబర్‌ 150, ఆ..ఆ' చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఇవ్వన్నీ భారీ బడ్జెట్‌ చిత్రాలే. ఒక్క 'అ..ఆ' మాత్రమే ఓ మోస్తరు బడ్జెట్‌తో రూపొందిన చిత్రం. అందునా ఆ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించాడు. ఇక నితిన్‌, సమంతలు కూడా ఓ మంచి స్థాయిలో ఉన్న నటీనటులే. 

మరి టోటల్‌గా ఓవర్‌సీస్‌లో హయ్యస్ట్‌ గ్రాస్‌ వసూలు చేసిన తొలి ఆరు చిత్రాలలో 'ఫిదా' చిత్రం కూడా చోటు దక్కించుకోవడం విశేషంగానే చెప్పాలి. ఇంకా కలెక్షన్లు బాగానే ఉన్నాయని, రిపీటెడ్‌ ఆడియన్స్‌ వస్తున్నారని అంటున్నారు. మరి ఈ చిత్రం 'ఖైదీనెంబర్‌ 150, ఆ..ఆ'లను కూడా దాటినా ఆశ్యర్యం లేదంటున్నారు ట్రేడ్‌ పండితులు. 

Fidaa Crosses Naannaku Premantho in US:

It's official! Mega Prince Varun Tej's mega blockbuster Fidaa crossed Young Tiger NTR's US biggest grosser Naannaku Prematho's collections.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ