గత శుక్రవారం ఒకదాని మీద ఒకటి పోటీకి దిగి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా... మంచి కలెక్షన్స్ సాధించలేక ముగ్గురు హీరోలు నితిన్, రానా, బెల్లంకొండ శ్రీనివాస్ లు తెగ నిరుత్సాహపడుతున్నారు. నాలుగు రోజుల సెలవలని ఎలాగైనా క్యాష్ చేసుకుని భారీ కలెక్షన్స్ కొట్టెయ్యాలనే అత్యాశతో బరిలోకి దిగిన మూడు సినిమాలకు ప్రేక్షకులు తమవైపు నుండి మంచి టాకే ఇచ్చారు. కానీ మూడు సినిమాలకు మంచి టాక్ అయితే వచ్చేసింది గాని కలెక్షన్స్ మాత్రం రావడంలేదు... ఆఖరికి పెట్టిన బడ్జెట్ వస్తుందా? అనే డౌట్ కూడా కొడుతోంది.
ఇలాంటి టైం లో ఈ శుక్రవారం హీరోయిన్ తాప్సి మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఆనందో బ్రహ్మ చిత్రం సోలోగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం హర్రర్ కామెడీగా తెరకెక్కింది. ఇక నిర్మాతలు ఈ చిత్రాన్ని ముందు నుండే ఆగష్టు 18 న విడుదల చెయ్యడానికే ఫిక్స్ అయ్యారు. మరి తాప్సి కోసం థియేటర్స్ నుండి లై ని గాని, నేనే రాజు నేనే మంత్రిని గాని, జయ జానకి నాయక ని గాని తీసెయ్యాల్సి ఉంటుంది. మరి ఇలా తాప్సి కోసం థియేటర్స్ ఇవ్వడానికి ముగ్గురు హీరోల తండ్రులైన బడా నిర్మాతలు ఒప్పుకుంటారా?. రానా తండ్రి సురేష్ బాబు, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి గాని, బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి సురేష్ ఒప్పుకుంటారా...!
ఈ లెక్కన తాప్సి ఈ ఆనందో బ్రహ్మ కి ఎంతగా పబ్లిసిటీ చేసినా కూడా ఉపయోగం ఉండదనే అంటున్నారు. ఒక పక్కన థియేటర్స్ దొరక్కుండా... మరో పక్క మూడు సినిమాలతో పోటీ పడుతూ ఇంత సాహసం చేస్తున్న ఎలా నెట్టుకొస్తుందో గాని... తాప్సికి మరో ఉపయోగం కూడా ఉందంటున్నారు. ఎందుకంటే ఈ శుక్రవారం వస్తామని చెప్పిన సినిమాలన్నీ సైడ్ అవ్వడంతో తాప్సి ఆనందో బ్రహ్మ గా సోలోగా వచ్చి హిట్ కొట్టాలనే తాపత్రయంలో ఉంది. చూద్దాం ఫైనల్ గా తాప్సి భవితవ్యం టాలీవుడ్ లో ఎలా వుండబోతుందో...?