షో ఎలా ఉన్నా తెలుగు వారికి కొత్త కావడంతో బిగ్‌బాస్ షోకి మంచి రేటింగ్సే వస్తున్నాయి. ఇక ఈ షోని తమ చిత్రాల ప్రమోషన్లుకు కూడా వాడుకుంటున్నారు. ఇలా బాలీవుడ్‌లో పలు చిత్రాల ప్రమోషన్లకు బిగ్‌బాస్ షో వేదికగా నిలిచింది. ఇక ఎన్టీఆర్ హోస్ట్ చేస్తుండటంతో శని, ఆది వారాల్లో మాత్రం రేటింగ్స్ బాగా వస్తున్నాయి. ఇటీవల ఈ షోని రానా దగ్గుబాటి తన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం ప్రమోషన్‌కి యూజ్ చేసుకున్నాడు. ఇది ఎంతో కొంత సినిమా పబ్లిసిటీకి, ప్రమోషన్‌కి ఉపయోగపడింది.
దీంతో ఈ శుక్రవారం విడుదల కానున్న తాప్సి నటించిన 'ఆనందో బ్రహ్మ' యూనిట్ కూడా ఈ షో ని తమ సినిమా ప్రమోషన్లకి వాడుకుంటోంది. తాజాగా ఈచిత్రంలో నటించిన తాప్సి తామే ప్లాన్ చేసుకున్న ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌లో ఈ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటర్ కానుందట. ఈ చిత్రం 18వ తేదీన విడుదలకానుంది. మీడియాకు ఇంటర్వ్యూలివ్వడం కంటే బిగ్‌బాస్‌షోలోకి వచ్చి ప్రమోషన్ చేస్తేనే బెటర్ అని తాప్సి నిర్ణయించుకోవడానికి మరో ప్రదాన కారణం కూడా ఉందంటున్నారు.
తాజాగా ఈ డిల్లీ భామ తాప్సి మన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మీద నానా కామెంట్స్ చేసి తెలుగు వారి కోపానికి కారణమైంది. ఈ సమయంలో అసలు ఆమె చిత్రాలనే చూడకుండా బహిష్కరించాలనే వార్తల జోరు కూడా ఊపందుకుంది. కానీ ఈషో చూసిన రాఘవేంద్రరావు గారు ఈ మాటలను ఎంతో లైట్‌గా తీసుకున్నారు కానీ.. మిగిలిన వారు ఇలా ఫైర్ కావడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని వ్యాఖ్యానించిన తాప్సి కేవలం తన చిత్రం తెలుగులో రిలీజ్‌కి రెడీగా ఉండటం వల్ల కామ్ అయిపోయింది కానీ లేకపోతే మరింత పబ్లిసిటీ కోసం దీనిని మరలా సాగదీసినా సాగదీసిఉండేది. మొత్తానికి తాప్సికి ఎలాంటి ఎదురు ప్రశ్నలు ఎదురురాని బిగ్‌బాస్ హౌసే సేఫ్ అనుకోని ఉంటుందని చెప్పవచ్చు.