నంద్యాల ఎలక్షన్స్ లో జనసేన పార్టీ తరుపున ఎవరూ పోటీ చెయ్యరని... అలాగే జనసేన ఏ పార్టీకి మద్దతివ్వదని కుండబద్దలు కొట్టేశాడు యాక్టర్ కం పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. ఇది పాలిటిక్స్ అప్ డేట్. యాక్టర్ గా అప్ డేట్ తన పుట్టినరోజు సెప్టెంబర్ 2 న త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే చిత్రానికి సంబందించిన ఎదో ఒక సర్ ప్రైజ్ ఫ్యాన్స్ కి ఇస్తాడని ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటివరకు టైటిల్ ఎనౌన్స్ చెయ్యలేదు. ఈలోపు అనేకరకాల టైటిల్ పవన్ కోసం అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. నిన్నటికి నిన్న 'రాజు వచ్చినాడు' అనే టైటిల్ పవన్ కోసం ఫిక్స్ అన్నారు. కానీ అది ఒట్టి రూమర్ అంటూ కొట్టిపడేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ ఇవ్వనున్నాడో తెలియదు గాని.... ఈ పుట్టినరోజు నాడు తన సినిమా కోసం ఫారిన్ ప్లాన్ చేశాడట. తన 25 వ సినిమా కోసం సెప్టెంబర్ 2న తన పుట్టినరోజు వేడుక ముగియగానే..... వెంటనే ఈ సినిమాకి సంబంధించి భారీ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ తో కలిసి పవన్ యూరోప్ వెళ్లబోతున్నాడట. ఈ సినిమాకి సంబందించిన కీలకమైన షెడ్యూల్ ని యూరప్ లో షూట్ చేయబోతున్నారట. ఇప్పటికే 75 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ భారీ షెడ్యూల్ తో మిగతా షూటింగ్ ని ఎట్టిపరిస్థితుల్లో కంప్లీట్ చెయ్యాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడట.
అసలు పవన్ అండ్ కో ఈ ఫారిన్ షెడ్యూల్ కి ఎప్పుడో వెళ్లాల్సి ఉందట. కానీ కొన్ని కారణాలు, కమిట్మెంట్స్ వల్ల అప్పుడు వాయిదా పడి ఇప్పుడు లైన్ కొచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడడం వలెనే సినిమాకి సంబందించిన బడ్జెట్ లిమిట్ కూడా దాటిపోయిందని టాక్ వినబడుతుంది. ఇక ఈ ఫారిన్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి బడ్జెట్ ని తగ్గించే యోచనలో చిత్ర యూనిట్ ఉందట. ఇక సెప్టెంబర్ 2 న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని గాని, టైటిల్ ని గాని రివీల్ చేసి సినిమా విడుదలకు డేట్ ఫిక్స్ చేస్తారని చెబుతున్నారు.