Advertisementt

భాన్సువాడ భానుమతి భయపెట్టే న్యూస్!

Sat 19th Aug 2017 01:52 PM
sai pallavi,fidaa,mca,naga shourya,sai pallavi thriller movie  భాన్సువాడ భానుమతి భయపెట్టే న్యూస్!
Sai Pallavi Signs Thriller Movie భాన్సువాడ భానుమతి భయపెట్టే న్యూస్!
Advertisement
Ads by CJ

'ఫిదా' చిత్రం విడుదలైన తర్వాత.. కొత్త చిత్రాలు అనేకం రిలీజ్‌ అయ్యాయి. కానీ 'ఫిదా'లోని భాన్సువాడ భానుమతిని మాత్రం మన ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. ఏ ఇద్దరు కలిసినా ఇప్పటికీ వారి మద్య కామన్‌గా వచ్చే టాపిక్స్‌లో ఒకటి సాయిపల్లవి గురించే. ఇప్పటికే మల్లార్‌ టీచర్‌గా మాలీవుడ్‌ని దెబ్బకొట్టిన ఈమె హవా టాలీవుడ్‌లో కూడా పెరిగిపోయింది. ఇక ఈ అమ్మడు తాజాగా నాగశౌర్య హీరోగా చేస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి నాగశౌర్య కన్నా సాయిపల్లవే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌. ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ మీద క్లూ ఇస్తే చాలు ఈ సాయిపల్లవి వల్ల బిజినెస్‌ అయిపోవడం ఖాయం. సరే తనకేదోలా హిట్‌ వస్తే అదే చాలని నాగశౌర్య కూడా ఉన్నాడు. 

ఇక ఈ అమ్మడు మరోసారి దిల్‌రాజు నిర్మాతగా నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా వేణుశ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఎంసీఏ' చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ చిత్రం 'నేను లోకల్‌'ని మించి పోవడం ఖాయమని, నటనాపరంగా నాని, సాయిపల్లవిలు పోటీ పడి నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక తాజాగా ఈ సాయిపల్లవి ఓ లేడీ ఓరియంటెడ్‌ థ్రిల్లర్‌ మూవీకి కూడా ఓకే చెప్పిందట. ఈ వార్త ఫిల్మ్‌నగర్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. అంతలా తన హర్రర్‌, థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ ద్వారా ఏకంగా సాయిపల్లవిని మెప్పించిన ఆ దర్శకుడు ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. 

ఇక ఈ చిత్రంలోని ట్విస్ట్‌లను చూసి ఆ పాత్ర ప్రేమలో భాన్సువాడ భానుమతి పడిపోయిందంటున్నారు. సినిమా మొత్తం సీరియస్‌ లుక్‌తో ఈ చిత్రంలో సాయిపల్లవి ఎంతో వినూత్నంగా ఉంటుందంటున్నారు. ఇక ఈ అమ్మడికి సౌత్‌తో ఉన్న క్రేజ్‌ చూసిన ఈ చిత్ర దర్శకనిర్మాతలు ఈ మూవీని ఒకేసారి తెలుగు, తమిళంతో పాటు మలయాళంలో కూడా తెరకెక్కించాలని ఓ కార్పొరేషన్‌ ఫిల్మ్‌ప్రొడక్షన్‌ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. 

Sai Pallavi Signs Thriller Movie:

Sai Pallavi Doing Thriller Movie After Nani MCA

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ