ప్రస్తుతం నందమూరి అభిమానుల కళ్లన్నీ సెప్టెంబర్1న విడుదల కానున్న 'పైసా వసూల్' పైనే ఉన్నాయి. ఈ చిత్రం పూరీ జగన్నాథ్‌కి, నిర్మాత ఆనంద్‌ప్రసాద్‌కి ఎంతో కీలకంకానుంది. ఇక ఈచిత్రంలోని పాటలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంతో అనూప్‌రూబెన్స్ టాప్ సంగీత దర్శకుల జాబితాలో చేరుతాడని పలువురు భావిస్తున్నారు. ఆయనకు పవన్, వెంకటేష్‌లు కలిసి నటించిన 'గోపాల గోపాల', పవన్‌తో సోలోగా చేసిన 'కాటమరాయుడు' చిత్రాలు పెద్దగా ఉపయోగపడలేదు. అయినా పూరీ బ్యాచ్‌లోని సంగీత దర్శకునిగా, స్వర్గీయ చక్రి స్థానాన్ని ఆక్రమించిన అనూప్ రూబెన్స్‌కి మాస్ సంగీత దర్శకునిగా, స్టార్ హీరోల దృష్టిలో పడటానికి కూడా 'పైసా వసూల్' చాలా కీరోల్ కానుంది.
ఇక ఈ చిత్రంలోని తాజాగా విడుదలైన 'కన్ను కన్ను' పాట ఎంతో బాగుంది. ముఖ్యంగా మెలోడీ లవర్స్‌ని ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక స్వయంగా ఓ మద్యం పాటను బాలయ్య పాడటం, మరో ఐటం సాంగ్‌లో ఇరగదీయడం విని ఈ పాటని చూస్తుంటే నవరసాలైన అన్ని పాటలను ఈ చిత్రం ద్వారా విందు భోజనంగా అనూప్ ఆడియన్స్‌ని అందించనున్నాడని తెలిసిపోతోంది. ఇక ఈ పాట విజువల్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. పోర్చుగీస్ అందాలు అందిరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పాటలో బాలకృష్ణ, శ్రియాశరన్‌ల కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. సో.. 'గోపాల గోపాల', 'కాటమరాయుడు'ల బాకీని కూడా 'పైసా వసూల్'తో అనూప్ తీర్చేస్తాడని భావించవచ్చు.