ఈమద్య ఓవర్‌సీస్ విషయానికి వస్తే సరైన కథాబలం లేని, కంటెంట్ లేని 'సరైనోడు, డిజె' వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ని బాగానే కట్టిపడేశాయి. కేవలం విభిన్న చిత్రాలను ఆదరించే ఓవర్‌సీస్ ప్రేక్షకులను, లేదా మొత్తం ప్రేక్షకుల్లో అలాంటి చిత్రాలను ఆదరించే కొద్దిస్థాయి ప్రేక్షకులను కాకుండా మాస్‌ని, యాక్షన్‌ని బాగా చూసే అత్యధిక శాతం రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులను టార్గెట్ చేయడం మంచిదని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
ఇక బాలయ్యతో ఏదో ఒకసారి మాత్రమే 'భైరవద్వీపం, ఆదిత్య 369, గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలు వస్తాయని, మిగిలిన 99శాతం చిత్రాలు కేవలం బిసీ ప్రేక్షకులను, పక్కా తెలుగు ప్రేక్షకులైన సామాన్యుల కోసమేనని అందరూ భావిస్తారు. దాంతోనే పూరీ సైతం 'పైసా వసూల్' చిత్రం విషయంలో అదే సేఫ్టీ జోన్‌లోనే పయనించాడని ఈ చిత్రం టైలర్, సాంగ్స్‌ని వింటే అనిపిస్తోంది. సాధారణంగా హీరోలను పూరీ చూపించే రూట్‌లోనే ఈచిత్రంలోని బాలయ్య పాత్ర కూడా ఉందని అర్ధమవుతోంది. కెరీర్ ఇబ్బందికరంగా ఉన్న సమయంలో ఏదో 'టెంపర్'వంటి ప్రయోగాలు అనవసరమని భావించే పూరీ రిస్క్‌లేని దారిని ఎంచుకున్ని షరా మమూలు కథతోనే వస్తున్నాడని అంటున్నారు.
ఆ విషయం తెలిసే స్టంపర్, ట్రైలర్ రిలీజ్ దాకా ఎక్కువగా బిజినెస్ చేయవద్దని, ఆతర్వాత సినిమాకు బయ్యర్ల నుంచి మంచి ఫ్యాన్సీ ఆఫర్లే వస్తాయని చెప్పిన పూరీ మాట ఇప్పుడు నిజం అవుతోంది. మొత్తానికి వైవిధ్యభరితమైన చిత్రాలను చూసే వారికి మాత్రం ఈ చిత్రంలో సంతృప్తిని ఆశించడం అత్యాశే అవుతుందని ఇండస్ట్రీ టాక్.