Advertisementt

ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు భయపడుతున్నారు!

Sun 20th Aug 2017 09:03 PM
jackie shroff,saaho,prabhas,panja,shakti,villain  ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు భయపడుతున్నారు!
Jackie Shroff's Key Role in Saaho ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు భయపడుతున్నారు!
Advertisement
Ads by CJ

'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయాలని సినిమా మొదలవ్వక ముందే డిసైడ్ అయ్యారు డైరెక్టర్ సుజిత్ మరియు చిత్ర నిర్మాతలైన యువి క్రియేషన్స్ వారు. మరి నాలుగు భాషల్లో సినిమాని విడుదల చేస్తున్నామంటే ఆ చిత్రానికి ఎటువంటి క్రేజ్ ఉండాలి. అందుకే సినిమాకి భారీ బడ్జెట్ పెట్టడమే కాదు. 'సాహో' కోసం భారీ నటులును అంటే బాలీవుడ్ నుండి తమిళం నుండి నటులను తీసుకుంటున్నారు. అన్ని భాషల నటులు 'సాహో'లో ఉంటే ఈ  సినిమాకి ఆటోమాటిక్ గా క్రేజ్ తన్నుకుంటూ వచ్చేస్తుంది. అందులో భాగంగానే బాలీవుడ్ నుండి హీరోయిన్ శ్రద్ద కపూర్ ని తీసుకున్న చిత్ర యూనిట్ ఒక విలన్ ని కూడా బాలీవుడ్ నుండే దిగుమతి చేసింది.

ఇక ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ హీరో మరియు తెలుగు సినిమాలు కొన్నిటిలో విలన్ గా నటించిన జాకీ ష్రాఫ్ ను 'సాహో'లో మెయిన్ విలన్ గా తీసుకుంటున్నారనే టాక్ ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ ని తెగ భయపెడుతుంది. వారు అంతగా కలవర పడడానికి మెయిన్ కారణమేమిటంటే జాకీ ష్రాఫ్ తెలుగు సినిమాలో విలన్ గా నటించిన సినిమాలన్నీ భారీ డిజాస్టర్స్ కావడమే. 'పంజా, శక్తి, అస్త్రం' వంటి సినిమాల్ని భారీ ప్లాపులవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు బెదిరిపోతున్నారట. మరి ఆ సినిమాలకు వచ్చిన కష్టమే 'సాహో'కి కూడా వచ్చే ఛాన్స్ ఉందని ప్రభాస్ ఫాన్స్ ఇప్పుడు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఒక్క ఫాన్స్ మాత్రమే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఇదే డిస్కర్షన్ స్టార్ట్ అయ్యింది.

మరి వాళ్ళు అంతలా ఇదైపోవడానికి కారణమేమిటంటే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ సెంటిమెంట్స్ ని ఎక్కువగా నమ్ముతుంది. ఆయన నటించిన సినిమాలన్నీ అంతటి ప్లాపయినప్పుడు ఇప్పుడు ప్రభాస్ 'సాహో'లో ఆయన్ని తీసుకోవడమెందుకు అంటూ భిన్న వాదనలు వినిపిస్తున్నారు. అందులోను వరుసగా నాలుగైదు సినిమాల్లో నటించిన తర్వాత ఆ సినిమాలన్నీ ప్లాపయితే గనక వారికీ ఐరెన్ లెగ్ టాగ్ కట్టి వదిలెయ్యడమనేది టాలీవుడ్ లో ఎప్పటినుండో వస్తున్న ఆచారం గనక ఇప్పుడు 'సాహో'లో విలన్ గా నటిస్తున్న జాకీ ష్రాఫ్ గురించి ఇంతిలా చర్చ కొనసాగుతుంది.

Jackie Shroff's Key Role in Saaho:

Neil Nithin Mukhesh and Chunki Pandey Another Bollywood actor Jackie Shroff and he will be shown as another villain of the movie Saaho. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ