చిన్న కొడుకు అఖిల్ రెండో సినిమా టైటిల్ కోసం నాగార్జున ప్రేక్షకులకు పజిల్స్ మీద పజిల్స్ వదులుతూ ఇంట్రస్టింగ్ గేమ్ ప్లే చేస్తున్నాడు. అఖిల్ రెండో సినిమాకి టైటిల్ ని సోమవారం అధికారికంగా ప్రకటించబోయే ముందు అందరి అటెన్షన్ అఖిల్ రెండో సినిమా మీద నుండి పక్కకి మరలకుండా గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా వేదికగా నాగార్జున, అఖిల్ టైటిల్ కి క్లూ ల మీద క్లూలు ఇస్తూ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. మొన్నటికి మొన్న అఖిల్ చిత్ర ఫస్ట్ లుక్ లీకైనప్పటికీ దాన్ని ఆఫీసియల్ గా వదిలేసి అఖిల్ మూవీ టైటిల్ కి క్లూ అంటూ తన భార్య అమలతో కలిసి నటించిన 'నిర్ణయం' సినిమాలోని హలో గురూ ప్రేమ కోసమేరా ఈ జీవితం అంటూ... పోస్ట్ చేశాడు.
అలాగే అఖిల్ బ్రదర్ నాగ చైతన్య తన కాబోయే భార్యతో కలిసి రెండో క్లూ ఇస్తాడంటూ పజిల్ మొదలుపెట్టాడు. నాగ్ చెప్పినట్టే నాగ చైతన్య కూడా కాబోయే భార్య సమంతతో కలిసి నటించిన 'ఏమాయ చేసావే' సినిమాలోని 'ఓ సోన.. ఓ సోన..హల్లో..' అనే పాటని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇక ఆ సాంగ్ ని 'హల్లో..ఓ... హలో' అంటూ ఎండ్ చేశాడు. మరి నాగార్జున పాట హాలోగురు ప్రేమకోసమే లో హలో కి, నాగ చైతన్య ఓ సోన పాటలోని హలో కి కనెక్ట్ అవడంతో అఖిల్ రెండో సినిమా టైటిల్ వీరిద్దరూ చెప్పిన 'హలో' కి నాగచైతన్య బ్రదర్ కాబట్టి టోటల్ గా ఈ మూవీ టైటిల్ నాగ్ హిట్ మూవీ 'హలో బ్రదర్' అంటూ పిచ్చగా ఫిక్స్ అయిపోయారు సదరు అక్కినేని ఫాన్స్ మరియు ప్రేక్షకులు.
ఇక ఫైనల్ గా అక్కినేని కాంపౌండ్ నుండి 'హలో బ్రదర్' అనే టైటిల్ లాంఛనంగా బయటికి రావడమే తరువాయి అంటున్నారు వీరంతా. ఇకపోతే అఖిల్ - విక్రమ్ కుమార్ కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జున డిసెంబర్ మూడో వారంలో విడుదల చేస్తామని అధికారిక ప్రకటన చేసినట్లే..... ఆగష్టు 21న అఖిల్ ఫస్ట్ లుక్ తోపాటే మూవీ టైటిల్ ఎనౌన్స్ చేస్తామని చెప్పాడు. ఇక ఆగష్టు 21న మూవీ టైటిల్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు.