Advertisementt

పూరి కనెక్ట్స్ తో 'బాగా' కనెక్ట్ అయ్యిందిగా!

Mon 21st Aug 2017 05:49 PM
puri jagannadh,charmi,paisa vasool audio launch,live in relation,puri wife lavanya  పూరి కనెక్ట్స్ తో 'బాగా' కనెక్ట్ అయ్యిందిగా!
Again Controversy on Puri and Charmi Relation పూరి కనెక్ట్స్ తో 'బాగా' కనెక్ట్ అయ్యిందిగా!
Advertisement
Ads by CJ

హీరోయిన్ ఛార్మికి టాలీవుడ్ లో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో పూరి జగన్నాధ్ కాంపౌండ్ లోకి చేరిపోయింది. పూరితో సన్నిహిత సంబంధాలు కలిగి అక్కడ పూరి కాంపౌండ్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చేసుకుంది. ఆ తర్వాత పూరి, తాను నిర్మాతలుగా 'జ్యోతిలక్ష్మి' సినిమా చేసి చేతులు కాల్చుకుని... ఇక సినిమా అవకాశాలు రావని ఫిక్స్ అయిన ఛార్మి, పూరి ప్రారంభించిన పూరి కనేక్ట్స్ లో వ్యాపార భాగస్వామిగా మారి అన్నివ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటూ అక్కడే సెటిల్ అయ్యింది. ఇక పూరి డైరెక్ట్ చేసే సినిమా వ్యవహారాలతో పాటే పూరి పర్సనల్ వ్యవహారాలు కూడా దగ్గరుండి చూసుకుంటుంది.

ఇక పూరికి కూడా చేతిలో సినిమాలున్నా కావాల్సిన హిట్ లేక దొరికిన హీరోతో దొరికినట్టు తనకిష్టమైన పంధాలోనే సినిమాలు డైరెక్ట్ చేసుకుంటూ పోతున్న సమయంలో బాలకృష్ణ పిలిచి మరి 'పైసా వసూల్' చిత్రాన్ని డైరెక్ట్ చెయ్యమనడంతో పూరి మళ్ళీ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. ఒక్క 'పైసా వసూల్' తోనే టాక్ ద ఇండస్ట్రీ అవడమేమిటి మొన్నటికి మొన్న డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల నుండి నోటీసులందుకుని మీడియాలో హైలెట్ అయ్యాడు. అయినా ఏమాత్రం  జంకకుండా 'పైసా వసూల్' పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటూ యాక్టివ్ అయ్యాడు. అలాగే ఛార్మి కూడా డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న పూరి డైరెక్షన్ లో సిట్ అధికారుల విచారణ నుండి తేలిగ్గానే బయటపడింది.

అయితే చార్మీతో పూరీకి 'లివ్-ఇన్' రిలేషన్ షిప్ ఉందన్నది టాలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతున్న టాక్. ఇక వీరి రిలేషన్ మీద రకరకాలుగా ప్రచారం కూడా జరిగింది. మరి ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లావణ్యకే పూరి అన్యాయం చేస్తాడా? అనే డౌట్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి అది వేరే విషయం. ఇక పూరి వైఫ్ కూడా గతంలో పూరి, ఛార్మి వ్యవహారం గురించి సన్నహితుల దగ్గర బాధపడిందనే  ప్రచారము ఉంది. పూరి, ఛార్మి తో రిలేషన్ పెట్టుకుని ఆఫీస్ వదిలి ఇంటికి కూడా రావడంలేదని పూరి భార్య సన్నిహితుల దగ్గర వాపోయినట్లు కూడా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు 'పైసా వసూల్' కి లైన్ ప్రొడ్యూసర్ గా, పూరి కనేక్ట్స్ బాధ్యతలతో ఛార్మి పగలనక రాత్రనక పూరితో కలిసి తిరుగుతుండడంతో వీరి రిలేషన్ షిప్ పై మరోసారి సినీజనాలకు ఆసక్తి పెరిగింది. మొన్నటికి మొన్న 'పైసా వసూల్' ఆడియో లాంచ్ కార్యక్రమంలో అన్నీ తానై నడిపించిన ఛార్మి, డైరెక్టర్ పూరీతో రాసుకుపూసుకు తిరిగేసింది. ఇదంతా లైవ్ టెలికాస్ట్ లో జనాలందరూ చూసేశారు కూడా. మరి ఇప్పుడు కూడా పూరి, ఛార్మి తమ మధ్యన ఉన్న రిలేషన్ షిప్ ని వారు దాయగలరా? లేకుంటే పూరి అన్ని విషయాల్లో కుండబద్దలు కొట్టేసినట్లు వీరి విషయాన్ని కూడా అలాగే కుండబద్దలు కొట్టేస్తాడా? అనే విషయం మాత్రం టాలీవుడ్ సర్కిల్స్ లో ఆసక్తిగా మారింది.

Again Controversy on Puri and Charmi Relation:

Puri Jagannadh and Charmi behaviour at Paisa Vasool Audio raises doubts on their Relation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ