Advertisementt

మరి తెలంగాణ మైఖేల్‌ జాక్సన్‌ ఎవరమ్మా?

Tue 22nd Aug 2017 01:21 PM
micheal jackson,pooja hegde,allu arjun,andhra pradesh,telangana  మరి తెలంగాణ మైఖేల్‌ జాక్సన్‌ ఎవరమ్మా?
Pooja Praises Allu Arjun As Andhra Michael Jackson మరి తెలంగాణ మైఖేల్‌ జాక్సన్‌ ఎవరమ్మా?
Advertisement
Ads by CJ

'ఒక లైలా కోసం, ముకుందా' చిత్రాలతో తెలగు ప్రేక్షకులను మెప్పించలేకపోయిన భామ పూజాహెగ్డే. ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌లో హృతిక్‌రోషన్‌తో 'మొహంజదారో' వంటి ప్రతిష్టాత్మక చిత్రం చేసినా ఆ చిత్రం కూడా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ అమ్మడిపై ఐరన్‌లెగ్‌ ముద్ర పడింది. అయినా అల్లుఅర్జున్‌-దిల్‌రాజు- హరీష్‌శంకర్‌లు డేర్‌ చేసి మెగా హీరోయిన్‌గా 'ముకుంద'లో నటించిన ఈ భామకు 'డిజె' (దువ్వాడ జగన్నాథం)లో చాన్స్‌ ఇచ్చారు. 

మొదటి చిత్రాలలో సంప్రదాయబద్దంగా కనిపించిన పూజా హెగ్డే 'డిజె'లో మాత్రం మోడ్రన్‌ టచ్‌, గ్లామర్‌షోతో ఇరగతీసింది. ఇక ఈ చిత్రం తర్వాత ఆమెకు ప్రభాస్‌-'జిల్‌' రాధాకృష్ణల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంతో పాటు దిల్‌రాజు- అశ్వనీదత్‌లు కలిసి మహేష్‌బాబుతో వంశీపైడిపల్లి చేయనున్న చిత్రంలో కూడా  అవకాశం వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈమె అల్లుఅర్జున్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న లాట్‌ మొబైల్‌ షోరూమ్ కి చెందిన షాప్‌ ఓపెనింగ్‌కి విజయవాడకి వచ్చి అభిమానులతో సెల్ఫీలు దిగింది. 

ఇక తాజాగా ఈమె మాట్లాడుతూ, బన్నీ ఆంధ్రా మైఖేల్‌ జాక్సన్‌ అని, ఆయన్ను మించిన డ్యాన్సర్‌ ఆంధ్రాలో పుట్టలేదని కామెంట్‌ చేసింది. అంటే బన్నీ కేవలం ఆంధ్రాకి మాత్రమే మైఖేల్‌ జాక్సనా? తెలంగాణలోని తెలుగు ప్రజలకు కాదా? అనే డౌట్‌ వస్తోంది. ఈ అమ్మడు ఇంకా ఒకటే తెలుగు రాష్ట్రంగా భావిస్తోందని, కానీ నేడు తెలుగు ప్రజలు 'తెలంగాణ, ఆంధ్రా'గా విడిపోయిన సంగతి ఆమెకు తెలియదేమో అని సెటైర్లు వినిపిస్తున్నాయి...! 

Pooja Praises Allu Arjun As Andhra Michael Jackson:

My favourite actor in Tollywood is the Micheal Jackson of Andhra Allu Arjun. I will be delighted to act with him anytime. Right now, I am looking for good scripts and roles so, I am going slow even though there are many opportunities..Pooja Hegde Said. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ