Advertisementt

లవ టీజర్: పాఠమా..! గుణపాఠమా..!

Fri 25th Aug 2017 03:29 PM
jai lava kusa teaser,lava teaser,lava kumar,bobby,jr ntr,kalyan ram  లవ టీజర్: పాఠమా..! గుణపాఠమా..!
Jai Lava Kusa Teaser- Lava Teaser Released లవ టీజర్: పాఠమా..! గుణపాఠమా..!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' చిత్రం మూడు పాటల మినహా షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. జై లవ కుశ చిత్రంపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే నెల 21 న ఖచ్చితంగా విడుదలవుతుందని ఎన్టీఆర్ ఆర్ట్స్ బల్లగుద్ది చెబుతుంది. అలాగే ముందు నుండి వారు చెప్పినట్టుగానే ఇప్పుడు 'లవ' టీజర్ తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది. 'లవ' ఫస్ట్ లుక్ లో ఎంతో కూల్ గా స్టైలిష్ లుక్ లో కనబడిన ఎన్టీఆర్ ఇప్పుడు లవ టీజర్ లో కూడా అంతే కూల్ గా స్టైలిష్ లుక్ లో కనబడుతున్నాడు. 

ఈ టీజర్ లో ఎన్టీఆర్ సూపర్ స్టయిల్ గా నడిచోస్తూ... తనని తాను పరిచయం చేసుకుంటాడు.  'హాయ్ ఐయామ్ లవ కుమార్... ఒక ప్రవేట్ బ్యాంకు లో మేనేజర్ గా పనిచేస్తున్నాను అంటూ వెరైటీగా నానో కారు బయటికి తీసి... దాన్ని వేసుకుని బయలుదేరిన లవ కుమార్... నాకో వీక్నెస్ వుంది అంటూ చెబుతుంటాడు.  బ్రహ్మజీ బ్యాంక్లో ఎదురుపడి ఎన్టీఆర్ బ్రీఫ్ కేస్ తీసుకోబోతూ సర్ మీ బాధ్యత ఎలాగూ మొయ్యలేను... కనీసం ఈ బ్రీఫ్ కేస్ అయినా మొయ్యనివ్వండి అంటూ అతి వినయం పోగా దానికి ఎన్టీఆర్, బ్రహ్మజీతో.. రాంబాబు గారు మీరు బ్యాంకు కి అసిస్టెంట్ మేనేజర్.. నాకు కాదు... అంటూ చాలా స్టయిల్ గా డైలాగ్ చెబుతాడు. ఇక మంచితనమనేది పుస్తకాల్లో ఉంటే పాఠమవుతుంది... మనలో ఉంటే గుణపాఠమవుతుంది అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా వుంది. ఇక ఆ మంచి తనమే నా జీవితాన్ని తల్లకిందులు చేసింది' అంటూ టీజర్ ని ముగించేశారు.

మరి 'లవ' టీజర్ ఎంతో సాఫ్ట్ గా, సైలెంట్ గా అనిపిస్తున్నప్పటికీ... అందులోని ఎమోషన్, ఎన్టీఆర్ ఫేస్ లోని ఎక్సప్రెషన్స్ వంటివి బాగున్నాయి. ఇక దేవిశ్రీ మ్యూజిక్ కూడా 'లవ' టీజర్ కి తగ్గట్టుగానే వుంది. స్మూత్ గా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ బాగానే హ్యాండిల్ చేస్తున్నాడనిపిస్తుంది. ఇది 'జై'  టీజర్, 'లవ' టీజర్ ని చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక ఈ రెండు టీజర్స్ తో కేక పెట్టించిన 'జై లవ కుశ' లో 'కుశ' టీజర్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. అయితే అతి త్వరలోనే ఆ టీజర్ ని కూడా విడుదల చేస్తామని ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు చెబుతున్నారు. మరి వినాయక చవితి శుభాకాంక్షలతో 'లవ' టీజర్ వచ్చేసింది.... అలాగే దసరా శుభాకాంక్షలతో 'జై లవ కుశ' చిత్రం విడుదల కాబోతుంది.

Click Here to See the Teaser

Jai Lava Kusa Teaser- Lava Teaser Released:

Jai Lava Kusa Teaser- Lava Teaser  talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ