Advertisementt

కృష్ణగాడి ప్రియురాలు లైన్లో పడింది..!

Mon 28th Aug 2017 09:31 PM
mehreen kaur pirzada,krishnagadi veera prema gadha,raja the great,jawaan,mahanubhavudu,mehreen  కృష్ణగాడి ప్రియురాలు లైన్లో పడింది..!
Mehreen Kaur Pirzada Busy with Movies కృష్ణగాడి ప్రియురాలు లైన్లో పడింది..!
Advertisement
Ads by CJ

'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' లో నాని ప్రియురాలు మెహరీన్ టైం స్టార్ అయ్యింది. 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' తర్వాత ఇప్పటివరకు ఒక్క చిత్రంతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని మెహరీన్ కౌర్ ఈ ఏడాది మాత్రం చేతినిండా సినిమాలతో వరసబెట్టి సందడి చేయనుంది. ఆమె నటించిన సినిమాలన్ని ఈ ఏడాది, వచ్చే ఏడాది వరసబెట్టి విడుదల కానున్నాయి. మెహరీన్, సాయి ధరమ్ తేజ కాంబినేషన్ లో బి.వి.ఎస్ రవి డైరెక్షన్ లో వస్తున్న 'జవాన్' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. త్వరలోనే విడుదలకు సిద్ధం కాబోతుంది. అలాగే  'రాజా ది గ్రేట్' చిత్రంలో రవితేజకి జోడిగా నటిస్తుంది.... ఆ సినిమా కూడా ఈ ఏడాదే విడుదల కాబోతుంది. ఇప్పటికే 'రాజా ది గ్రేట్' టీజర్ తో ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

ఇక ఇప్పుడు తాజాగా శర్వానంద్ తో 'మహానుభావుడు'లో మారుతి డైరెక్షన్ లో నటిస్తుంది. ఆ చిత్రం వచ్చే దసరా బరిలో దిగడానికి రెడీగా వుంది. ఈ 'మహానుభావుడు' టీజర్ తో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇకపోతే మెహరీన్, సందీప్ హీరోగా వస్తున్నా c /o సూర్యలో కూడా నటిస్తుంది. ఇక ఈ చిత్రం కూడా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఇన్ని సినిమాలతో సందడి చేస్తున్న మెహరీన్ పొరుగు రాష్ట్రం తమిళనాడులో కూడా జెండా పాతడానికి రెడీగా వుంది. ప్రస్తుతానికి మెహరీన్ తమిళంలో 'నెంజిల్ తునివిరుందల్'(Nenjil Thunivirundhal ) లో నటిస్తుంది.

మెహరీన్ ఇన్ని సినిమాలు వరుసగా విడుదలకు సిద్దమవుతుంటే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ చిత్రాలు మాత్రం ఏడాదికి ఒకటి రెండు మాత్రమే విడుదలవుతున్నాయి. ఇప్పుడు మెహరీన్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తుంటే మాత్రం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి టఫ్ కాంపిటేషన్ ఇచ్చే రేంజ్ కి ఎదిగినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు.

Mehreen Kaur Pirzada Busy with Movies:

Mehreen Kaur Pirzada Movies Ready for Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ