అనేక పార్టీలు మారి, టిడిపిలో కూడా ఉండి.. తాజాగా వైసీపీలో నగరి ఎన్నికల్లో గెలిచి, ఆ నియోజకవర్గం నుంచి రోజా ఎమ్మెల్యేగా ఉంది. ఈమెకు వైసీపీలోనే కాదు.. మొత్తంగా ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆమె మాట్లాడే భాష పట్ల ఎందరో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసభ్యకర వ్యాఖ్యలు సైగల ద్వారా ఆమె శాసనసభ నుంచి కూడా సస్పెండ్ అయింది. ఆమె వ్యాఖ్యలు ఖండించదగినవే అయినా ఆమె 'నారాలోకేష్'ని పప్పు అని, చంద్రబాబు నాయుడుని బొల్లిబాబు, పవన్‌కళ్యాణ్‌ని సినిమాలలో 'గబ్బర్‌సింగ్' ... రాజకీయాలలో ఆయన ఓ 'లబ్బర్‌సింగ్' అంటూ వ్యాఖ్యానిస్తూ తనదైన ప్రత్యేకతను ఏర్పరచుకుంది. అవి పార్టీకి మేలు చేస్తాయా? లేక డ్యామేజ్ చేస్తాయా? అనేది పక్కనపెడితే ఇప్పుడు ఆమెకి సరైన ప్రత్యామ్నాయం కలిగిన సినీ నటికోసం టిడిపి ఎదురుచూస్తోంది.
విషయానికి వస్తే చెన్నెలోని మలయాళ కుటుంబంలో పుట్టి, మలయాళంలో యాక్షన్ లేడీగా, సరైన అవయవ కొలతలు, సహజమైన అందం, సెక్సీఅప్పీల్ ఉన్న నటిగా, మాలీవుడ్ యాక్షన్ క్వీన్‌గా, జులియా రాబర్ట్‌గా ప్రేక్షకులు వాణీ విశ్వనాథ్‌ని ఆరాధిస్తారు. ఈమె పలు తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు చిత్రాలలో కూడా నటించింది. చిరంజీవి సరసన 'కొదమసింహం, ఘరానామొగుడు'తో పాటు ఎన్నో చిత్రాలలో ఎందరో హీరోలతో కలిసి పనిచేసింది. ఇక ఈమె మలయాళీ నటుడు బాబూజీని పెళ్లి చేసుకుంది. కానీ తాను పుట్టి పెరిగిన తమిళనాడులో గాక, తన మాతృభాష అయిన కేరళలో కాకుండా ఆమె తాజాగా తెలుగు రాజకీయాలపై, అందునా ఏపీలో పాగా వేయాలని చూస్తోంది.
తాజాగా నగరికి చెందిన పలువురు దేశం నాయకులు వాణివిశ్వనాథ్‌ని కలిసి టిడిపిలో చేరమని కోరారు. రోజాకు ధీటుగా సమాధానం కలిగిన నాయకురాలిగా ఆమెను టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. త్వరలో ఆమె ఏపీలో తెలుగుదేశంలో చేరి, వచ్చే ఎన్నికల్లో రోజాకి పోటీగా నగరి నియోజకవర్గం నుంచి టిడిపి తరపున పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇంతకాలానికి వాణివిశ్వనాథ్ రూపంలో రోజాకి చెక్ పెట్టాలని యోచిస్తున్నారు. ఇక తాజాగా ఈమె బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయక'లో కూడా కీలకమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.