Advertisementt

'గది 2' లో శివ కనిపించాడు..!

Tue 29th Aug 2017 06:57 PM
nagarjuna,raju gari gadhi 2,motion poster,shiva  'గది 2' లో శివ కనిపించాడు..!
Raju Gari Gadhi 2 Motion Poster Released 'గది 2' లో శివ కనిపించాడు..!
Advertisement
Ads by CJ

నాగార్జున నటిస్తున్న 'రాజు గారి గది 2' ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో నాగార్జున ఒక కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. 'రాజు గారి గది' హిట్ టైటిల్ తో కంటిన్యూ అవుతున్న 'రాజు గారి గది 2' లో నాగ్ కు కాబోయే కోడలు సమంత కూడా కీ రోల్ లో నటిస్తుంది. ఓంకార్, తన తమ్ముడు అశ్విన్ హీరోగా... కింగ్ నాగార్జున మెయిన్ లీడ్ లో ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ట్మాకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక నాగార్జున ఈ చిత్రంలో మానసిక వైద్యుడిగా  కనిపించనున్నాడు. ఈ 'రాజు గారి గది 2' అక్టోబర్ లో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తుంది చిత్ర యూనిట్. అందులో భాగంగానే  వినాయక చవితి రోజున 'రాజు గారి గది 2' టైటిల్ లోగోని విడుదల చేసింది. అలాగే నాగార్జున బర్త్ డే సందర్భంగా మంగళవారం 'రాజు గారి గది 2' మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది. 

ఈ మోషన్ పోస్టర్ లో నాగార్జున రుద్రాక్ష మాలతో రౌద్రంగా కనబడుతున్నాడు.  అలాగే మోషన్ పోస్టర్ లో 'రుద్రం అభయ ముద్రం.. ప్రణయ విలయ రుద్రం... గగన రౌద్రం... ప్రణయ వలయ రుద్రం.. అభయముద్రం... జనన నయన ముద్రం.. గగన రౌద్రం...' అంటూ వస్తున్న బ్యాగ్రౌండ్ తో నాగార్జున లుక్ ని రివీల్ చెయ్యడం, ఆ లుక్ లో వున్న శివ చిత్రాన్ని తలపించడం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి అదిరిపోయే లెవల్లో మ్యూజిక్ అందించాడనే విషయం ఈ 'రాజు గారి గది 2' బ్యాగ్రౌండ్ స్కోర్ లో తెలుస్తుంది. 

ఓంకార్ కెరీర్ లోనే పెద్ద నటులతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. ఈ చిత్రంతో ఓంకార్ స్టార్ డైరెక్టర్ గా ఎదగాలని ఆశపడుతున్నాడు. అందుకే పెద్ద నటులతో చేస్తున్న ఈ సినిమాని ఎంతో కేర్ తీసుకుని మరీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని అక్కినేని పుట్టినరోజున అంటే సెప్టెంబర్ 20 న విడుదల చేసి... అదే నెల చివరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ లెవల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Click Here to See the Motion Poster 

Raju Gari Gadhi 2 Motion Poster Released:

Nagarjuna Birthday Special:  Raju Gari Gadhi 2 Motion Poster Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ