Advertisementt

గుండుకైనా రెడీ- హీరోయిన్ ఓపెన్ ఆఫర్!

Tue 29th Aug 2017 09:47 PM
disha patani,bald,loafer heroine,bald role  గుండుకైనా రెడీ- హీరోయిన్ ఓపెన్ ఆఫర్!
Disha Patani ready to go BALD! గుండుకైనా రెడీ- హీరోయిన్ ఓపెన్ ఆఫర్!
Advertisement
Ads by CJ

చాలా మంది హీరోయిన్లు తమ కెరీర్‌ ప్రారంభ దశలో కేవలం నటనకు అవకాశం ఉన్నపాత్రలే చేస్తాం.. ఎక్స్‌పోజింగ్‌ చేయమని భీష్మించుకుని కూర్చుంటారు. కానీ ఆ తర్వాత పోటీని తట్టుకోలేక పాత్ర డిమాండ్‌ చేసిందనో, లేక మరో విధంగానో చెప్పి అందాలను ఆరబోస్తారు.

ఈ కోవలోకి రాశిఖన్నాతో పాటు ప్రియమణి సహా పలువురు వస్తారు. 'ఊహలు గుస గుసలాడే' చిత్రంలో గ్లామర్‌షో లేకుండా నెట్టుకొచ్చిన రాఖిఖన్నా పోటీ ఎక్కువ రావడం, తనతో పాటే అటుఇటుగా పరిశ్రమకు పరిచయమైన రకుల్‌ప్రీత్‌సింగ్‌, రెజీనా వంటి వారి పోటీకి తట్టుకోలేక ఇప్పుడు గ్లామర్‌ పాత్రలను పట్టి ఏకంగా ఎన్టీఆర్‌ సరసన 'జై లవ కుశ' చిత్రంలో నటిస్తోంది. 

ఇక గతంలో సినిమాల కోసం శరత్‌కుమార్‌, చరణ్‌రాజ్‌లతో పాటు పలువురు గుండు కొట్టించుకున్నారు. మరికొందరు హీరోలు నగ్నంగా కూడా కనిపించారు. కానీ నేడు అటువంటి హీరోలు, హీరోయిన్లు తక్కువైపోతున్నారు. ఆమద్య ఎప్పుడో లెస్బియన్‌ కథాంశంలో వచ్చిన బాలీవుడ్‌ చిత్రంలో షబానా ఆజ్మీ గుండు కొట్టించుకుని సత్తా చాటింది. 

ఈ విషయమై తాజాగా 'లోఫర్‌' భామ దిశాపటానీ మాట్లాడుతూ, నేడు హీరోయిన్లుగా మనగలగాలంటే గ్లామర్‌షో తప్పదని, బాలీవుడ్‌ హీరోయిన్లకు ఇది మరీ తప్పనిసరి అని తేల్చేసింది. ఇక ఏ హీరోయిన్‌ కూడా తనకు తానుగా తక్కువగా చూసుకోవాలని భావించదు. ఆ హీరోయిన్‌ అభిమానులు కూడా తాము ఇష్టపడే హీరోయిన్లు అలా చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ నాకు నటనకు ప్రాధాన్యం ఉండి, గుండు కొట్టించుకోవడాన్ని స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేస్తే ఖచ్చితంగా గుండు కొట్టించుకునే నటిస్తాను.. ఇది ఖచ్చితమని చెప్పింది. 

Disha Patani ready to go BALD!:

Disha Patani is among those few current B-Town actresses who've built a steady fan following in remarkably less amount of time. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ