Advertisementt

రానా షో లో బాలయ్య..రచ్చ రచ్చంట..!!

Wed 30th Aug 2017 06:40 PM
balakrishna,rana daggubati,puri jagannadh,no 1 yaari with rana show,paisa vasool  రానా షో లో బాలయ్య..రచ్చ రచ్చంట..!!
Balayya Attends Rana No 1 Yaari Show రానా షో లో బాలయ్య..రచ్చ రచ్చంట..!!
Advertisement
Ads by CJ

'పైసా వసూల్' పబ్లిసిటీ పీక్స్ లో ఉంది. వరుసగా ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇస్తున్న బాలకృష్ణ, శ్రియ, ముస్కాన్, కైరా, పూరి జగన్నాధ్ లు ఇప్పుడు బుల్లితెర మీద హీరోలు హోస్ట్ లుగా సందడి చేస్తున్న రియాలిటీ షోస్ మీద కూడా కన్నేశారు. ఈ శుక్రవారం విడుదలకు సిద్దమవుతున్న 'పైసా వసూల్' టీమ్ విపరీతమైన పబ్లిసిటీతో ఆకట్టుకుంటున్నారు. అందులో భాగంగానే బాలకృష్ణ, పూరి జగన్నాధ్ లు ఇద్దరు జెమినీ ఛానల్ లో ఆదివారం రాత్రి ప్రసారమవుతున్న నెంబర్ 1 యారి షోకి వెళ్లారట. హీరో రానా హోస్ట్ గా తెరకెక్కుతున్న ఈ షోలో బాలయ్య, పూరి లు హంగామా సృష్టించారట. 

మాములుగా అయితే బాలకృష్ణ బయట ఎక్కడైనా స్టేజ్ మీద మాట్లాడాడు అంటే ఆ స్పీచ్ జనాలు ఎవ్వరికి సరిగ్గా అర్ధమే కాదు. ఏదేదో మాట్లాడేస్తూ జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. బయట బాలయ్య ఎలా మాట్లాడినా, సినిమాలో మాత్రం ఎంత భారీ డైలాగ్ అయినా... చాలా ఈజీగా అందరికి అర్ధమయ్యేలా మాట్లాడి అదరగొట్టేస్తాడు. సినిమాల్లో డైలాగ్ డెలివరీలో బాలకృష్ణ తో పోటీపడే హీరోలు ఉండరు అంటే అతిశయోక్తి ఉండదు. కానీ రానా మాత్రం డైలాగ్ డెలివరీలో బాలయ్యకి పోటీ వచ్చాడంటున్నారు. బాలకృష్ణ తో యంగ్ హీరో రానా పోటీపడి మరి డైలాగులను చెప్పాడనే న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

వచ్చే ఆదివారం ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ షూటింగ్ తాజాగా జరిగిందట..ఈ నెంబర్ 1 యారి షోలో బాలయ్య బాబుతో రానా పోటీ పడి మరి డైలాగ్స్ చెప్పాడట. 'ఏమంటివి ఏమంటివి...' అంటూ సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ని రానా, బాలయ్య లు పోటీ పడి మరి చెప్పారట. ఈ ఒక్క డైలాగ్ నెంబర్ 1 యారి ఎపిసోడ్ కే హైలెట్ అంటున్నారు. అలాగే నెంబర్ 1 యారి షోలో వచ్చిన ఎపిసోడ్స్ అన్నింటిలో ఈ బాలయ్య వచ్చిన ఎపిసోడ్ హైలెట్ అంటున్నారు. నందమూరి ఫ్యాన్స్ తో పాటే సదరు ప్రేక్షకులు కూడా బాలయ్య - పూరి, రానా ల  హంగామా మొత్తం త్వరలో ప్రసారం కాబోయే నెంబర్ 1 యారీలో వీక్షించొచ్చన్నమాట. 

మరి ఇప్పటివరకు స్టార్స్ అంతా తమ సినిమాల పబ్లిసిటీని రియాలిటీ షోలో బెస్ట్ గా దూసుకుపోతున్న బిగ్ బాస్ షోలోనే నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ షోకి ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. మరి అందరూ బిగ్ బాస్ షోని వేదికగా చేసుకుని సినిమాలను ప్రమోట్ చేసుకుంటుంటే బాలకృష్ణ మాత్రం రానా షోకి ఇంపార్టెన్స్ ఇచ్చి బిగ్ బాస్ షోని తక్కువ చెయ్యడం కొంతమందికి నచ్చకపోయినా... బాలకృష్ణకి వెళ్లడం ఇష్టం లేకే బిగ్ బాస్ షోని అవాయిడ్ చేశారంటున్నారు. ఇకపోతే బాలయ్య బిగ్ బాస్ కి వెళ్లకపోయినా 'పైసా వసూల్' డైరెక్టర్ పూరి వెళ్లాడనే టాక్ వినిపిస్తుంది. 

Balayya Attends Rana No 1 Yaari Show:

Balayya and Puri Jagannath have shot for an episode of Rana Daggubati's No.1 Yaari. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ