బాలకృష్ణ 101 వ చిత్రం 'పైసా వసూల్' శుక్రవారమే థియేటర్స్ లోకి దిగబోతుంది. పూరి డైరెక్షన్ లో బాలయ్య బాబు ఫుల్ ఎనర్జిటిక్ తో నటించిన ఈ మూవీ ప్రమోషన్స్ పరంగా బెస్ట్ అనే రీతిలో దూసుకుపోతుంది. బాలకృష్ణ హీరోయిన్స్ శ్రియ, ముస్కాన్, కైరా లతో కలిసి పలు ఇంటర్వ్యూ లు ఇవ్వడమే కాకుండా బుల్లితెర మీద రియాలిటీ షోస్ లో కూడా డైరెక్టర్ పూరి తో కలిసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. బాలకృష్ణ ఎనర్జీకి కుర్ర హీరోలు బెదిరిపోతున్నారు. అనుకున్న టైమ్ కన్నా ముందే 'పైసా వసూల్' ని కంప్లీట్ చెయ్యడమే కాదు అనుకున్న డేట్ కన్నా ముందే థియేటర్స్ లోకి తెచ్చి పూరి అండ్ బాలయ్యలు శెభాష్ అనిపించుకున్నారు.
అయితే బాలయ్య 'పైసా వసూల్' పబ్లిసిటీలో భాగంగా తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ గురించి కూడా ప్రస్తావించాడు. తన కలల ప్రాజెక్ట్ సాకారం అయ్యే రోజు దగ్గరకు వచ్చేసిందని... త్వరలోనే ఆ చిత్రం గురించి ఎనౌన్స్ చేస్తా అంటున్నాడు. తాను తన తండ్రి పాత్రలో నటిస్తానని ఎప్పుడో చెప్పిన బాలయ్య... ఆ ప్రాజెక్ట్ కి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని... మరో రెండు మూడు రోజుల్లో తన తండ్రి బయోపిక్ ని తెరకెక్కించే డైరెక్టర్ పేరు రివీల్ చేస్తా అంటున్నాడు. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ గురించిన తనకు తెలిసిన విషయాలతో పాటే తన బంధువుల దగ్గర ఉన్న సమాచారంతోపాటు, మరికొంతమంది సన్నహితుల దగ్గర ఉన్న ఎన్టీఆర్ వివరాలు సేకరిస్తున్నామని తెలిపాడు.
ఇక తాను కూడా ఈ మధ్యనే చెన్నై కి వెళ్లి మరీ తన తండ్రికి సంబందించిన కొన్ని డిటైల్స్ తెలుసుకోగలిగానని చెబుతున్న బాలయ్య సినిమాలు వేగం పెంచడానికి గల కారణం ఏమిటని అడగగా... సినిమాల వలన ఇండస్ట్రీలో పదిమందికి పని కల్పించొచ్చనే ఉద్దేశ్యంతోనే తాను ఇలా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.