Advertisementt

పెళ్లి క్యాన్సిల్‌ పై నిఖిల్ స్పందన ఇది..!

Sat 02nd Sep 2017 12:00 AM
nikhil siddharth,marriage cancel,hero nikhil marriage rumors  పెళ్లి క్యాన్సిల్‌ పై నిఖిల్ స్పందన ఇది..!
Nikhil Reaction on his Marriage Cancel News పెళ్లి క్యాన్సిల్‌ పై నిఖిల్ స్పందన ఇది..!
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా విభిన్న చిత్రాల హీరోగా ఊపు మీదున్న నిఖిల్‌ పెళ్లి చేసుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన బంధువుల అమ్మాయితో ఆయన వివాహం నిశ్చయమైందని వార్తలు వస్తున్నా నిఖిల్‌తో సహా వాటిని ఎవ్వరూ ఖండించకపోవడంతో ఇది నిజమేనని అందరూ భావించారు. 

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం నిఖిల్‌తో వివాహం జరుగుతుందని భావించిన అమ్మాయి ఓ ప్రముఖ సినీ పరిశ్రమకు పరిచయం ఉన్న వ్యక్తికి దగ్గరి బంధువని, ఆయన కుమార్తెను వివాహం చేసుకుంటే తనకు సినీ రంగంలో ఓ గాడ్‌ఫాదర్‌ లభించినట్లేనని నిఖిల్‌ భావించినట్లు సమాచారం. ఆయన మామగారు ప్రముఖ పారిశ్రామిక వేత్త, బాగా స్థితిమంతుడు కావడంతో ఇక నిఖిల్‌కి కూడా మంచి భవిష్యత్తు ఖాయమని అందరూ భావించారు. 

కానీ అమ్మాయి, అబ్బాయిల జాతకాలు సరిపోకపోవడంతో ఈ వివాహం క్యాన్సిల్‌ అయిందని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా తాను స్పందించకపోతే పరిస్థితి చేయి దాటుతుందని భావించిన నిఖిల్‌ తన పెళ్లి వార్త ఉన్న ఓ న్యూస్‌ని తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేసి, దీని గురించి నేనేమీ మాట్లాడదలుచుకోలేదు... అంటూనే నేను సింగిల్‌ గానే ఉన్నాను. తదుపరి రెండు చిత్రాల షూటింగ్‌లపై పూర్తి దృష్టి పెట్టాను అంటూ పోస్ట్‌ చేయడంతో, నిఖిల్‌ మౌనం అర్ధాంగికారమేనని వార్తలు జోరందుకున్నాయి. 

Nikhil Reaction on his Marriage Cancel News:

Hero Nikhil Siddharth Tweet on His Marriage Cancel News

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ