అనుష్క 'బాహుబలి' సినిమాతో జాతీయ స్థాయిలో దేవసేనగా గుర్తింపు పొందింది. బాహుబలిలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ కూడా పిచ్చగా బిజీ అయ్యారు ఒక్క అనుష్క తప్ప. కారణం ఆమె ఫిట్ గా లేకపోవడమే. అనుష్క కి 'బాహుబలి' తర్వాత అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారి పోతున్నాయి. తన ఫ్రెండ్ ప్రకాష్ కోవెలమూడి కోసం 'సైజ్ జీరో' లో బాగా బరువు పెరిగిన అనుష్క ఆ సినిమా విడుదలై చాలా రోజులైనా కూడా ఇప్పటికి మామూలు వెయిట్ కి రాలేక నానా రకాల ఇబ్బందులు పడుతుంది. 'బాహుబలి 1' లో దేవసేనగా చాలా అందంగా కనబడిన అనుష్క 'బాహుబలి 2' లో మాత్రం బొద్దుగా కనబడింది.
ఇక తాజాగా అనుష్క కి రెండు పెద్ద ప్రాజెక్ట్ లలో చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఒకటి ప్రభాస్ సరసన సాహో చిత్రంలో.. బాహుబలితో క్రేజ్ కొట్టేసిన అనుష్క అయితే బావుంటుందని చిత్ర యూనిట్ మొదట భావించింది. కానీ అనుష్క వెయిట్ ఎక్కువ ఉండడంతో ఆ అవకాశం బాలీవుడ్ నటి శ్రద్ద కపూర్ కి దక్కింది. ఇక రెండో అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ 'సై రా నరసింహారెడ్డి' లో కూడా అనుష్క కే మొదటగా ఛాన్స్ వచ్చింది. 'సై రా' చిత్రం జాతీయ స్థాయిలో తెరకెక్కడంతో ఈచిత్రంలో దేవసేనగా అదరగొట్టిన అనుష్క అయితే చిరుకి జోడిగా బావుంటుందని భావించినా....అనుష్క బరువు ఎక్కువ ఉండడం... అలాగే ఫిట్ గా లేకపోవడంతోనే అనుష్క ని పక్కకి పెట్టి నయనతార ని తీసుకున్నారనే టాక్ కూడా వినబడుతుంది.
మరి రెండు భారీ ప్రాజెక్ట్ లు చేజారడంతో అనుష్క బాగా హార్ట్ అయ్యి... బరువు తగ్గి మళ్ళీ నాజూగ్గా మారడం కోసం గట్టి ప్రయత్నాలే మొదలెట్టింది. ప్రస్తుతం యోగా శిక్షకురాలిగా ఉన్న తాను... దానితో పెద్దగా పని జరిగేలా లేదని... జిమ్ నే నమ్ముకుంటుందట. అందుకే జిమ్ లో గంటలు కొద్దీ గడుపుతోందట. అసలు ఇంట్లో కంటే ఎక్కువగా జిమ్‌లోనే వుంటోందని.... భారీగా పారితోషికమిచ్చి ఒక పర్సనల్ ట్రెయినర్‌ని కూడా అనుష్క పెట్టుకుందనే టాక్ వుంది. చూద్దాం మరికొన్ని రోజుల్లో మనం మళ్ళీ పాత అనుష్కనే చూడబోతామో... లేకుంటే...!