Advertisementt

'సై రా' లో ఈ సుందరి నిజమేనా..!

Sun 03rd Sep 2017 07:23 PM
pragya jaiswal,chiranjeevi,mega star,sye raa narasimha reddy  'సై రా' లో ఈ సుందరి నిజమేనా..!
Pragya Jaiswal in Chiranjeevi Sye Raa Narasimha Reddy 'సై రా' లో ఈ సుందరి నిజమేనా..!
Advertisement
Ads by CJ

పద్దతిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఆ తర్వాత అవకాశాల కోసం గ్లామర్ ప్రదర్శించక తప్పడం లేదు హీరోయిన్స్ కి. 'కంచె' లో ఎంతో ట్రెడిషనల్ గా కనబడిన ప్రగ్య జైస్వాల్  ఆ తర్వాత నటించిన సినిమాల్లో అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇచ్చింది. అయినా అమ్మడుకు అదిరిపోయే అవకాశాలేమి తలుపు తట్టడంలేదు. ఆ అందాల ఆరబోతకు 'సై' అన్న సినిమాలేవీ హిట్ కాకపోవడంతో అమ్మడు పరిస్థితి ఘోరంగా తయారవడమే కాదు... అందుకే బికినీ షో చెయ్యడానికి రెడీ అయ్యింది.

'నక్షత్రం'లో అయితే ప్రగ్య జైస్వాల్ అందాల ఆరబోత మాత్రం పిచ్చెక్కించేసింది. ఆ లెవల్లో బికినీతో రెచ్చిపోయింది. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత 'జయ జానకి నాయక'లో కూడా ప్రగ్య అందాల ఆరబోత మాములుగా లేదు. ఆ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. అయితే ప్రగ్య జైస్వాల్ ని ఒక మెగా అవకాశం తలుపుతట్టిందనే ప్రచారం మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్ర 'సై రా నరసింహారెడ్డి' చిత్రంలో ప్రగ్య హీరోయిన్ గా ఎంపికైందని న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

'సై రా' లో నయనతార మెయిన్ హీరోయిన్ కాగా... ఇంకో రెండు హీరోయిన్ పాత్రలకు గాను ఒక హీరోయిన్ గా ప్రగ్య ఎంపికైనట్లుగా చెబుతున్నారు. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారనే టాక్ ఉంది. ఇక ఈ సినిమాలో ప్రగ్య ని తీసుకున్నదే నిజమైతే ప్రగ్యాకి బంపర్ ఆఫర్ తగిలినట్టే. కాకపోతే ఈ విషయంలో మెగా సర్కిల్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

Pragya Jaiswal in Chiranjeevi Sye Raa Narasimha Reddy:

Pragya Jaiswal Second Heroine in Mega Star Sye Raa Narasimha Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ