Advertisementt

ఉపాసన సందేశం: రామ్ చరణ్ - 4 కుక్కపిల్లలు!

Wed 06th Sep 2017 05:28 PM
ram charan,upasana,teachers day special,upasana tweet,mr c  ఉపాసన సందేశం: రామ్ చరణ్ - 4 కుక్కపిల్లలు!
Upasana Teachers Day Special Tweet ఉపాసన సందేశం: రామ్ చరణ్ - 4 కుక్కపిల్లలు!
Advertisement
Ads by CJ

ఉపాసన కామినేని నుండి ఉపాసన కొణిదెల గా మారాకే ఉపాసనకు పబ్లిక్ పాలోయింగ్ బాగా పెరిగింది. ఎందుకంటే రామ్ చరణ్ కి భార్యగా, మెగా ఫ్యామిలీ కి కోడలిగా ఉపాసన అంటే అందరికి ఒకలాంటి అభిమానం వచ్చేసింది. ఇక ఉపాసన మాత్రం చరణ్ ని పెళ్లి చేసుకున్నప్పటి నుండి భార్యగా, మెగా ఫ్యామిలీ కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తన తాతగారి హయం నుండి వస్తున్న అపోలో హాస్పిటల్ పనుల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఇక తన విషయాలు, తన భర్త చరణ్ విషయాలు, తన తండ్రి ఫ్యామిలీ విషయాలు, అలాగే తన మామ చిరు గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చురుగ్గా ఉంటుంది.

ఇక చరణ్ ని ముద్దుగా మిస్టర్ సి అని పిలుచుకునే ఉపాసన.. రామ్ చరణ్ మీద తన ప్రేమను ఎప్పటికప్పుడే సోషల్ మీడియా ద్వారా బహిరంగంగానే పంచుకుంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఉపాసన మిస్టర్ సి గురించిన ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తెల్లని డ్రెస్ లో రామ్ చరణ్ నడుస్తుండగా నాలుగు కుక్కపిల్లలు చరణ్ తో పాటు నడుస్తున్నాయి. ఇక ఆ వీడియో తో పాటే 'మిస్టర్ సి తనకు ఇష్టమైనవాటితో కలిసి నడుస్తున్నాడు. ఆరోగ్యకరమైన జీవితానికి గోల్స్ ఉండాలని మనకు నేర్పుతున్నాడు. బద్ధకమన్నది జీవితంలో ఓ వ్యాధిలాంటిది.. కాబట్టి ముందుకు కదలండి' అంటూ... రామ్ చరణ్ సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్. టీచర్స్ డే అనే హ్యాష్ ట్యాగ్స్ ని జత చేసి మరి షేర్ చేసింది. 

Click Here to See the Video Tweet

Upasana Teachers Day Special Tweet :

Upasana Konidela Tweet for Teachers Day with Mr C and 4 Dogs

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ