తాజాగా రానా హోస్ట్ చేస్తున్న 'నెంబర్‌వన్ యారి' షోకి బాలయ్య, పూరీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా.. పూరీ, బాలయ్య ఇద్దరి మద్య ఉన్న అవగాహన గూర్చి తెలుసుకునేందుకు ఇద్దరినీ కొన్ని ప్రశ్నలు వేశాడు. వీటిలో దాదాపు అన్నింటికి ఇద్దరు ఒకే సమాధానం చెప్పారు. రానా.. పూరీని బాలయ్య సెట్‌లోకి రాగానే ఏం చేస్తాడు? అని అడిగి, అదే ప్రశ్నకు ఆన్సర్‌ని బాలయ్యను ఓ కాగితంంలో రాయమని అడిగాడు. దీనికి సమాధానంగా పూరీ చెబుతూ, బాలయ్య షూటింగ్ స్పాట్‌కి వచ్చిన వెంటనే అందరికీ విష్ చేస్తారు అని చెప్పాడు. బాలయ్య కూడా పేపర్లో అదే సమాధానం రాశాడు.
ఇక బాలకృష్ణ ఈ సందర్భంగా తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ గురించి చెబుతూ, ఓ సారి నాన్నగారు షూటింగ్ లొకేషన్‌కి వచ్చి కూర్చున్నారు. అక్కడ పడేసి ఉన్న ఓ అరటి తొక్కను చూసిన ఎన్టీఆర్ అక్కడ ఉన్న అందరిలో ఒకరిని పిలిచి ఆ తొక్కను బయటపడవేయమని ఆదేశించారు. ఆ పని చేస్తున్న వ్యక్తి ఆశ్చర్యపడిపోయాడు. ఆ అరటి పండును తానే తిని అక్కడ తొక్కను పడేసింది నేనే అని ఎన్టీఆర్‌కి ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? అని ఆశ్యర్యపోయాడట. ఈ విషయాన్ని చెప్పి బాలకృష్ణ రానా, పూరీలను నవ్వించాడు.