సెలబ్రిటీలు కాస్త హుందాగా ఉండాలి. మరీ ముఖ్యంగా దేశానికి ప్రాతినిధ్యం వహించే, దేశానికి గుర్తుగా ఇండియా టీంకు కెప్టెన్ వంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కాగా ఇండియన్ మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలిరాజ్ ఇలాంటి ఓ సంఘటన వల్ల పలు విమర్శలను ఎదుర్కొంటోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేయగా, మిగిలిన అందరూ కాస్త పద్ధతైన దుస్తులను ధరించినప్పటికీ భారత కెప్టెన్ మిథాలీరాజ్ ధరించిన దుస్తులు మాత్రం అభ్యంతరకరంగా ఉన్నాయి. దీంతో నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు.
వారు ఆమె దుస్తులపై స్పందిస్తూ... డిలేట్ చేయండి మేడమ్... మిమ్మల్ని ఎందరో స్ఫూర్తిగా తీసుకుంటారు. కానీ మీరు వేసుకున్న దుస్తులు సరిగాలేవు.. మీ నుంచి ఇలాంటివి ఊహించలేదు. మీపై మీకు ఎలాగూ గౌరవం లేదు. కనీసం అభిమానులకు మీపై ఉన్న గౌరవాన్ని అయినా నిలబెట్టుకోండి....నీవు ఇండియా మహిళల టీం కెప్టెన్ వి. సినిమా సెలబ్రిటీవి కావు. ఈ ఫొటో డిలేట్ చేసేయ్....మిమ్మల్ని ఇలాంటి దుస్తుల్లో చూడలేకపోతున్నాం. భారతీయ యువతిగా, అందులోనూ తమిళనాడు యువతిగా ఉండండి.. అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మిథాలిరాజ్‌కి ట్వీట్స్ పెడుతూ, తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.