నేటి రోజుల్లో కథా చౌర్యం, మేధో దోపిడీ అనేవి ఎక్కువైపోయాయి. దేశ విదేశాలలోని చిత్రాల పాయింట్లు తీసుకుని, వాటికి తమదైన మార్పులు చేసి ఎదుటివారికి కాపీ రైట్ చట్టంకి కూడా దొరక్కుండా ఫ్రీమేక్‌లు చేస్తున్న కాలం ఇది. ఇక విషయానికి వస్తే వక్కంతం వంశీ అందించిన కథతో బండ్ల గణేష్ నిర్మాతగా, యంగ్‌టైగర్ ఎన్టీఆర్-కాజల్ అగర్వాల్‌లు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'టెంపర్'. అప్పటివరకు మూస చిత్రాలతో, వరుస ఫ్లాప్‌లలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ను ఈ చిత్రం గాడిలో పెట్టింది. కాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రణవీర్‌సింగ్ హీరోగా రోహిత్‌శెట్టి రీమేక్ చేయనున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై రోహిత్ శెట్టి వివరణ ఇచ్చాడు.
తాను 'టెంపర్' చిత్రం రీమేక్ హక్కులు కొన్నది నిజమేనని, కానీ సినిమాలోని కేవలం నాలుగైదు సన్నివేశాలనే తన చిత్రంలో వాడుకుంటున్నానని, మిగిలిన చిత్రం మొత్తం తాను తయారు చేసుకున్న సొంత స్క్రిప్ట్ మీదనే కథ ఆధారపడి ఉంటుందని క్లారిటీఇచ్చాడు. కేవలం నాలుగైదు సీన్లను వాడుకోవడం కోసం భారీ మొత్తాన్ని చెల్లించి రీమేక్ హక్కులు తీసుకోవడం అంటే చాలా గొప్పగానే చెప్పాలి. ఎందుకంటే ఆ నాలుగైదు సీన్లను కూడా తనదైన రీతిలో మలిచి ఫ్రీమేక్ చేసినా ఎవ్వరికీ దొరకరు. కానీ రోహిత్‌శెట్టి మాత్రం నిజాయితీగా ఈచిత్రం రీమేక్ హక్కులను కొని మరీ ఈ చిత్రంలోని నాలుగైదు సీన్లను అధికారికంగా వాడుకుంటుండటం నిజంగానే గ్రేట్ అని చెప్పాలి.