Advertisementt

కుర్చీ తిరిగే సీన్ కి చాలా మేటరుంది!

Fri 08th Sep 2017 06:39 PM
revolving chair,pawan kalyan,pspk 25,trivikram srinivas  కుర్చీ తిరిగే సీన్ కి చాలా మేటరుంది!
PSPK25- Revolving Chair Scene Sensation కుర్చీ తిరిగే సీన్ కి చాలా మేటరుంది!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న పవన్ 25 వ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. ఈ దెబ్బకి సంక్రాతి సీజన్ కి వచ్చే సినిమాలన్నీ సర్దుకునేలాగే కనబడుతున్నాయి. ఎందుకంటే త్రివిక్రమ్ - పవన్ కలయికలో సినిమా అంటే అది దాదాపు విజయం సాధిస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇకపోతే పవన్ 25  వ చిత్ర సంగీత దర్శకుడు అనిరుధ్ ఒక మ్యూజిక్‌ బిట్‌ రిలీజ్‌ చేశాడు. ఆ బిట్ లోనే పవన్ కళ్యాణ్ చివరిలో కుర్చీని తిప్పుతూ కనబడే సన్నివేశం ఒకటి ఉంది. అయితే ఆ బిట్లోనే ఆ సన్నివేశాన్ని చూపించడానికి ఒక కారణం ఉందట. ఎందుకంటే పవన్ 25 వ సినిమాలో ఆ సన్నివేశమే... కీలకం అంటున్నారు.

ఈ సినిమా లో ఆ సన్నివేశం పవన్ కళ్యాణ్ అజ్ఞాతం నుండి బయటికొచ్చిన తర్వాత ఒక్కసారిగా పవన్ ఆగ్రహం చూపించే సన్నివేశంగా సమాచారం అందుతుంది. ఆ ఒక్క సన్నివేశంతోనే సినిమా ఎక్కడికో వెళ్లిపోతుందట. అలాగే ఆ సన్నివేశం వచ్చేటప్పుడు ప్రేక్షకులు కుర్చీల్లో కూర్చోకుండా నానా హంగామా చేస్తారని విశ్వసనీయ సమాచారం. అలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో దాదాపుగా నాలుగైదు ఉంటాయని.... కానీ ఆ ఒక్క సీన్ లో మాత్రమే హీరో ఎలివేషన్‌లో మరో స్థాయిలో నిలిచిపోయేలా వుంటుందని చెబుతున్నారు. అందుకే దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ షాట్‌ని ఇప్పుడే వదిలేసి సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇక ఈ సినిమాలో పవన్‌ రెండు భావాలున్నపాత్రలో కనిపిస్తాడట. అందులో ఒకటి శాంత స్వభావి కాగా... మరొకటి పాత్ర ఫుల్‌ మాస్‌ హీరోయిజం వుట్టిపడే పాత్ర అట. 

ఇక సినిమాని చాలా జాగ్రత్తగా చెక్కుతున్న త్రివిక్రమ్ ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతోనే సంక్రాతి బరిలో నిలిపాడట. ఎలాంటి సినిమాలు ఉన్నా తమ సినిమా విజయం సాధిస్తుందంటున్నాడట. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుపుకుంటుంది. ప్రస్తుతం చిత్ర బృందం థాయిలాండ్ లో ఉందట. ఇక ఈ షెడ్యూల్లో పవన్ - కీర్తి సురేష్ ల మీద ఒక రొమాంటిక్ సాంగ్ ని తెరకెక్కించనున్నారట. దానితోపాటే కొన్ని కీలక సన్నివేశాలను కూడా అక్కడ విదేశాల్లోనే తెరకెక్కించనున్నారనే సమాచారం అందుతుంది.

PSPK25- Revolving Chair Scene Sensation:

PSPK25 – Shot of Power Star and Revolving Chair!! Sending Fans into Frenzy!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ